బీజేపీ విలువలు లేని రాజకీయం చేస్తుందంటూ విమర్శలు గుప్పించారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ , ఎమ్మెల్యే జగ్గారెడ్డి. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా స్వామ్య బద్దంగా ఎన్నికలు జరిగేవని, ఎన్నుకున్న ప్రభుత్వాలను బీజేపీ కుల్చేస్తోందని, నీచమైన రాజకీయాలు బీజేపీ చేస్తుందని ఆయన ఆరోపించారు. ప్రజలు అధికారంకి బీజేపీ నీ దూరం చేసినా… షార్ట్ కట్ లో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. చెండాలమైన రాజకీయాలు బీజేపీ చేస్తుందని, శివసేనలో చీలికలు తెచ్చి… బీజేపీ మహారాష్ట్ర లో ప్రభుత్వం కూల్చిందని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో విచిత్ర పాలన నడుస్తుందన్న జగ్గారెడ్డి.. మొన్నటి దాకా కుస్తీ పట్టిన బీజేపీ..టీఆర్‌ఎస్‌లు ఇప్పుడు సైలెంట్ అయ్యారన్నారు. ఛలో ఢిల్లీ అని చెప్పిన కేసీఆర్… ఇప్పుడు ఢిల్లీ నుండి మోడీనే మూడు రోజులు హైదరాబాద్ కి వస్తున్నారన్నారు.
మోడీకి ఇక్కడ నిరసన ఎందుకు తెలపడం లేదని, తెలంగాణకి ఇచ్చిన హామీల అమలుపై ఎందుకు నిలదీయడం లేదని, కేసీఆర్ ఎందుకు సైలెంట్ గా ఉన్నాడని ఆయన ప్రశ్నించారు. మోడీని ఎందుకు ఘెరవ్ చేయడం లేదని, తెలంగాణ ప్రజల్ని బీజేపీ..టీఆర్‌ఎస్ కలిసి మోసం చేస్తుంది అనేది అర్దం అవుతుందని ఆయన వెల్లడించారు. మోడీ ప్రధాని గానే వస్తున్నారు కదా.. బీజేపీ కార్యవర్గ సమావేశంకి ప్రధాని హోదాలోనే వస్తున్నాడు కదా..? మరి ఎందుకు హామీలపై ప్రశ్నించడం లేదన్నారు.