బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు తెలంగాణలో జరుగనున్న విషయం తెలిసిందే. అయితే.. ఒకటి నుండి నాలుగో తేదీ వరకు కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను తెలంగాణ బీజేపీ నేతలు విడదుల చేశారు. జులై 1న మధ్యాహ్నం 3 గంటలకు జేపీ నడ్డా శంషాబాద్ చేరుకుంటారు. శంషాబాద్ పట్టణంలో కిలో మీటర్ మేర జేపీ నడ్డాకు స్వాగతం పలుకుతూ రోడ్ షో.. తెలంగాణ సాంస్కృతి,సంప్రదాయాలు, కళలు, సాహిత్యం, తెలంగాణ ఉద్యమం, నిజాంకు వ్యతిరేకంగా సాగిన పోరాట ఘట్టాలను ఫోటో ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఎగ్జిబిషన్ ను జేపీ జేపీ నడ్డా ప్రారంభిస్తారు. ఆ రోజు రాత్రి 7గంటలకు జాతీయ ప్రధాన కార్యదర్శులతో జేపీ నడ్డా సమావేశం అవుతారు. రాత్రి 8:30కి భారత నాట్యం, పెరిణి శివ తాండం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. జులై 2న ఉదయం 10గంటలకు జాతీయ పదాధికారులతో జేపీ నడ్డా సమావేశమవుతారు.
సాయంత్రం 4గంటలకు కార్యవర్గ సమావేశాలను జేపీ నడ్డా ప్రారంభిస్తారు. జులై 3న కార్యవర్గ సమావేశాలు కొనసాగుతాయి. సాయంత్రం 4 గంటలకు కార్యవర్గ సమావేశాలు ముగుస్తాయి… ముగింపు ప్రసంగం మోడీ చేస్తారు. సాయంత్రం 5గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో విజయ సంకల్ప సభ పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. మోడీ, నడ్డ, అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటారు. 4వ తేదీన ఉదయం అన్ని రాష్ట్రాల సంస్థాగత ప్రధాన కార్యదర్శులు సమావేశమవుతారు. నాల్గవ తేదీ మధ్యాహ్నం సమావేశాలు ముగుస్తాయి.