Flexes against Modi: భారత ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ పర్యటన నేపథ్యంలో వెలసిన ఫ్లెక్సీలు కలకలం సృష్టిస్తున్నాయి. మోడీ రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించే ఏరియాలో మోడీని ఉద్దేశించి గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
గీతా ప్రెస్ ఆలయం కంటే తక్కువ కాదు, సజీవ విశ్వాసం అని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం అన్నారు. గోరఖ్‌పూర్‌లో జరిగిన గీతా ప్రెస్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని మోడీ ప్రసంగించారు. "గీతా ప్రెస్ ప్రపంచంలోని ఏకైక ప్రింటింగ్ ప్రెస్, ఇది ఒక సంస్థ మాత్రమే కాదు, సజీవ విశ్వాసం. గీతా ప్రెస్ కేవలం ప్రింటింగ్ ప్రెస్ మాత్రమే కాదు, కోట్లాది మందికి దేవాలయం" అని ప్రధాని అన్నారు.
రేపు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తొలి సారి వరంగల్ జిల్లాకు వస్తుండటంతో తెలంగాణ బీజేపీ నేతలు ప్రధాన పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇక ఇదే క్రమంలో జనగామ జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి ప్రధాని పర్యటన పై మీడియా సమావేశం నిర్వహించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్ట మొదటి సారిగా వరంగల్ కు వస్తున్న ఏకైక ప్రధాని నరేంద్ర మోడీ అని ఆయన అన్నారు.
ప్రధానమంత్రిపై దుర్భాషలాడడం అవమానకరమైనదని,బాధ్యతారాహిత్యమైనదని.. అయితే అది దేశద్రోహం కాదని, పాఠశాల యాజమాన్యంపై దేశద్రోహ కేసును రద్దు చేస్తూ కర్ణాటక హైకోర్టు పేర్కొంది.
PM Modi: ఈ ఏడాది ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు ఛత్తీస్‌గఢ్ పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో దాదాపు రూ.7,600 కోట్ల విలువైన ఎనిమిది ప్రాజెక్టులకు మంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
Bus Accident: ప్రధాని నరేంద్ర మోడీ ర్యాలీకి వెళ్తున్న బీజేపీ కార్యకర్తల బస్సు ప్రమాదానికి గురైంది. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు ఇద్దరు బీజేపీ కార్యకర్తలు మృతి చెందగా, మరో 5 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ ఉదయం వరంగల్‌లో పర్యటించనున్నారు. రేపు పీఎం మోడీ వరంగల్ పర్యటనకు రానున్న నేపథ్యంలో కిషన్ రెడ్డి వరంగల్ కు బయలుదేరారు. ఇవాల ఉదయం కిషన్ రెడ్డి తన నివాసంలో పూజలు చేసిన అనంతరం వరంగల్ బయలు దేరారు.
ప్రధాని మోడీ ఈ నెల 8న ప్రధాని మోడీ వరంగల్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. అయితే.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వరంగల్ పర్యటన షెడ్యూల్‌ను పిఎంవో విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం.. వారణాసి నుంచి ప్రత్యేక విమానంలో హకీంపేటకు చేరుకుని వరంగల్ పర్యటన ముగించుకుని తిరిగి హకీంపేట నుంచి రాజస్థాన్ కు బయలుదేరే వరకు మొత్తం 3 గంటల 45నిమిషాలు తెలంగాణలో ఉండనున్నారు ప్రధాని మోడీ. 8న ఉదయం ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్ పోర్ట్…