వరంగల్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రం, ముఖ్యమంత్రి కేసీఆర్ పై చేసిన ఆరోపణలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మేము అవినీతి చేశామని ప్రధాని మోడీ అంటున్నారు కదా.. దర్యాప్తు సంస్థలు అన్నీ మీ చేతిలో ఉన్నాయి కదా?.. ఏమి చేస్తున్నారు?.. మీరు అని ఆయన ప్రశ్నించారు.
రాజస్థాన్‌లోని బికనీర్‌లో తన బహిరంగ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అంటే దోపిడీ దుకాణం, అబద్ధాల మార్కెట్ అని ప్రధాని మోడీ విమర్శలు గుప్పించారు.
ప్రతిపక్ష పార్టీలను, ప్రభుత్వాలను కూల దొస్తున్న ఘనత ప్రధాని మోడీకే దక్కుతుంది అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు రంగాల్లో 1, 2, 3 స్థానాల్లో ముందుంది అని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రభాగాన నిలబెట్టిన ఘనత సీఎం కేసీఆర్ కి దక్కుతుందన్నారు. ప్రధాని స్థాయి దిగజారి మా ముఖ్యమంత్రిని, ఆయన కుటుంబంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని గుత్తా మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్రంపైన, సీఎం కేసీఆర్ పైన ప్రధాన మంత్రి మోడీ చేసిన వాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను అని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. బీజేపీ పార్టీలో అనేక మంది కుటుంబ సభ్యులు ఎంపీలుగా ఉన్నారు.. అవినీతి ప్రభుత్వం బీఆర్ఎస్ అంటున్నారు.. ఎక్కడ అవినీతి ఉందొ తెల్వదా?.. అని వినోద్ కుమార్ అడిగారు.
వరంగల్ లోని బీజేపీ నిర్వహించిన సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సీఎం కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలకు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. ఈ సభలో మోడీ పచ్చి అబద్ధాలు మాట్లాడారు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అస్సలు తెలంగాణ ఉద్యమంలో మోడీ పాత్ర ఎంటి..?, మోడీయే విశ్వాస ఘతకుడు.. ద్రోహి అద్వానీ, వెంకయ్య నాయుడులను అతను తొక్కి వేశారు అంటూ ఆరోపించారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రతి పథకం పేరు మార్చి మోడీ ప్రభుత్వం కాపీ కొట్టిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. మేం పని మంచిగా చేయకపోతే ఎందుకు మా పథకాలను కాపీ కొట్టారు.. ఎందుకు ఢిల్లీలో అవార్డులు ఇస్తున్నారు అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణకు పెట్టుబడులు వస్తున్నాయి అని ప్రధాని మోడీ అంటున్నారు.. పెట్టుబడులు వస్తున్నాయి అంటే కేసీఆర్ గొప్పతనం అని మంత్రి పేర్కొన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగంపై బీఆర్ఏస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పందించారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణ ప్రజల 45 ఏళ్ల కల అని ఆయన డిమాండ్ చేశారు. గుజరాత్ కి 20 వేల కోట్ల రూపాయల లోకోమోటివ్ ఫ్యాక్టరీ తన్నుకుపోయిన ప్రధాని, 520 కోట్ల రైల్వే వ్యాగన్ రిపేర్ షాప్ పెట్టడం తెలంగాణ ప్రజలను అవమానించడమే అని కేటీఆర్ అన్నారు. తొమ్మిదేళ్లలో దేశ యువత కోసం చేసిన ఒక్క మంచి పనైనా ప్రధాని…
ప్రధాని మోడీ కార్యక్రమాన్ని అధికార బీఆర్ఎస్ ఎందుకు బహిష్కరించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రధానమంత్రి కార్యక్రమాన్ని ఎందుకు బహిష్కరించారో చెప్పాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు.
Etala Rajender: బీఆర్ఎస్ను దించేది బీజేపీ నే అని, ఇప్పటికే ఆలస్యం జరిగిందని బీజేపీ నేత ఈటెల రాజేందర్ అన్నారు. కేసీఆర్ ను గద్దె దించేందుకు కేంద్ర పార్టీ సహకారం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.
MMTS from Hyderabad to Yadadri: వరంగల్ జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. ముందుగా భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి తెలంగాణ ప్రజలందరి తరపున ప్రధాని మోడీకి స్వాగతం పలికారు.