మణిపూర్ రాష్ట్రంలో గత రెండు నెలలుగా కొనసాగుతున్న అల్లర్లపై దేశం మొత్తం స్పందిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదని విపక్ష కూటమి పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. దీనిపై ఇవాళ లోక్ సభలో ప్రధాని మోడీ మాట్లాడనున్నారు. ఇక, తాజాగా మణిపూర్ లో చేలరేగిని హింస నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు ప్రధాని మోడీతో సమావేశం అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు 40 మంది ఎమ్మెల్యేలు పీఎంఓకు ఓ లేఖ రాశారు.
Read Also: Bharat Express: సికింద్రాబాద్ వచ్చే వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో పొగలు..
మణిపూర్ రాష్ట్రంలోని రెండు గిరిజన తెగల మధ్య చెలరేగిన హింస వల్ల మూడు నెలలుగా అశాంతి నెలకొంది అని ఆ లేఖలో 40 మంది ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ఇక ఎమ్మెల్యేల లేఖ రాయడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, పార్లమెంట్ ఉభయ సభల్లో మణిపూర్ అంశంపై విపక్ష పార్టీలు అధికార పక్షంపై ఒత్తిడి తెస్తున్నాయి. పార్లమెంట్ లో ప్రధాని ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇక, దీనిపై ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ ఈ తీర్మానంపై చర్చలో పాల్గొని సమాధానం ఇవ్వనున్నారు.
Read Also: Kurnool Road Accident: కర్నూలులో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు!
అయితే, మణిపూర్ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ ఏం మాట్లాడతారోనని ఉత్కంఠ నెలకొంది. మోడీ రిప్లై తరువాత ఈ తీర్మానంపై లోక్ సభలో ఓటింగ్ జరుగుతుంది. బీజేపీ-ఎన్డీఏ కూటమికి సంపూర్ణ మెజారిటీ ఉండటం వల్ల ఈ తీర్మానం వీగిపోవడానికి అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఎన్డీఏకు 331.. బీజేపీకి సొంతంగానే 303 ఎంపీలు ఉన్నారు.. ఇక, విపక్షాల కూటమికి 144 మంది ఎంపీల బలం ఉంది. మరో 70 మంది ఎంపీలు తటస్థంగా వ్యవహరిస్తున్నారు.