Bus Accident: ప్రధాని నరేంద్ర మోడీ ర్యాలీకి వెళ్తున్న బీజేపీ కార్యకర్తల బస్సు ప్రమాదానికి గురైంది. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు ఇద్దరు బీజేపీ కార్యకర్తలు మృతి చెందగా, మరో 5 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ ఉదయం వరంగల్‌లో పర్యటించనున్నారు. రేపు పీఎం మోడీ వరంగల్ పర్యటనకు రానున్న నేపథ్యంలో కిషన్ రెడ్డి వరంగల్ కు బయలుదేరారు. ఇవాల ఉదయం కిషన్ రెడ్డి తన నివాసంలో పూజలు చేసిన అనంతరం వరంగల్ బయలు దేరారు.
ప్రధాని మోడీ ఈ నెల 8న ప్రధాని మోడీ వరంగల్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. అయితే.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వరంగల్ పర్యటన షెడ్యూల్‌ను పిఎంవో విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం.. వారణాసి నుంచి ప్రత్యేక విమానంలో హకీంపేటకు చేరుకుని వరంగల్ పర్యటన ముగించుకుని తిరిగి హకీంపేట నుంచి రాజస్థాన్ కు బయలుదేరే వరకు మొత్తం 3 గంటల 45నిమిషాలు తెలంగాణలో ఉండనున్నారు ప్రధాని మోడీ. 8న ఉదయం ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్ పోర్ట్…
ఈనెల 8 వతేదీన రాష్ట్రంలో పర్యటించనున్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు విస్తృత స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేయనున్నట్టు డీజీపీ అంజనీ కుమార్ తెలిపారు. ఈనెల 8 న ప్రధాని మోడీ హన్మకొండలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలలో పాల్గొనేందుకై వస్తున్న నేపథ్యంలో బందోబస్తు, భద్రతా పరమైన అంశాలపై నేడు వరంగల్ పోలీస్ కమీషనర్, ఇతర సీనియర్ పోలీస్ అధికారులతో
ఈ నెల 8న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా వరంగల్ కమిషనరేట్ పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగం ప్రధాన మంత్రి పర్యటించే ప్రాంతాల్లో గగనతలాన్ని నో ప్లై జోన్ ప్రకటిస్తూ వరంగల్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్ గురువారం ఉత్తర్వులు జారీ చేసారు. ఈ ఉత్తర్వులను అనుసరించి ప్రధాన మంత్రి భద్రత దృష్ట్యా నేటి నుండి 8తేదీ వరకు వరంగల్,
8 న వరంగల్ కి ప్రధాని మోడీ వస్తున్నారని, రైల్వే శాఖకు సంబంధించి వాగన్ తయారీ యూనిట్ కి శంకుస్థాపన చేస్తారన్నారు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంవత్సరానికి 2,400 వ్యాగన్ ల తయారీ.. మొదటి దశలో 521 కోట్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు.
వరంగల్ జిల్లా కాజీపేటలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, శాసన మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలపై వరంగల్ కు వచ్చే ప్రధాని మోడీ స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీతో పాటు డివిజన్ గా మార్చే విషయంపై మోడీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హస్తిన పర్యటన ముగిసింది.. ఈ ఉదయం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం.. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశం అయ్యారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ హాల్ లో సీపీఐ పార్టీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కునంలేని సాంబశివరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. మునుగోడు ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఓడిపోవడంతో రోజురోజుకు గ్రాఫ్ పడిపోయింది.. త్వరలో జరుగబోయే నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఓడిపోవడం ఖాయమన్నారు.