MP Gaurav Gogoi: మణిపూర్ అల్లర్లపై ప్రధాని మోడీ మౌనవ్రతం వీడాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభమైంది. చర్చను కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ ప్రారంభించారు. చర్చ ప్రారంభంపై అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రాహుల్ గాంధీ ఎందుకు చర్చను ప్రారంభించలేదుని బీజేపీ ఎంపీలు బీజేపీ ఎంపీలు నిలదీశారు. మణిపూర్‌లో జరుగుతున్న అల్లర్లపై అవిశ్వాస తీర్మానం ఇచ్చామని గౌరవ్ గొగొయ్ పేర్కొన్నారు. దేశంలో హింస ఎక్కడ జరిగినా అది ప్రజాస్వామ్యానికి విఘాతమేనని ఆయన అన్నారు. మణిపూర్ అంశంపై ప్రధాని మౌనవ్రతం పాటిస్తున్నారని గౌరవ్ గొగొయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
ప్రధాని నరేంద్ర మోడీని మూడు అంశాలపై ప్రశ్నిస్తున్నామని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ అన్నారు. ఇప్పటి వరకు ప్రధాని మోడీ మణిపూర్ ఎందుకు వెళ్లలేదు? ప్రధాని శాంతికి పిలుపు ఇచ్చి ఉంటే అది చాలా ప్రభావవంతంగా ఉండేది.. మణిపూర్‌కు విపక్షాలు వెళ్లాయి, రాహుల్ వెళ్లారు, మోడీ ఎందుకు వెళ్లలేదు? మణిపూర్ తగలబడుతుంటే.. భారత్ తగలబడుతున్నట్లేనని ఆయన తెలిపారు.
Read Also: PM Modi: ప్రతిపక్షాలది ఇండియా కూటమి కాదు.. అహంకారుల కూటమి..!
ప్రధాని నరేంద్ర మోడీ ముందు మణిపూర్ వెళ్లి చూడండి.. అప్పుడు మాట్లాడండి. మణిపూర్‌లో డబుల్ ఇంజిన్ సర్కారు విఫలమైంది అని ఎంపీ గొగొయ్ విమర్శించారు. మణిపూర్ లో మహిళపై దాడులు, అక్కడి పౌరులపై దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మణిపూర్ లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో దేశమంతా చూసింది అని గొగొయ్ అన్నారు. మణిపూర్ మంత్రి సోదరుడు డ్రగ్ మాఫియా నడుపుతున్నారు.. డ్రగ్ మాఫియా నిందితుడిని సీఎం ఫోన్‌కాల్‌తో విడుదల చేశారు అని గౌరవ్ గొగొయ్ అన్నారు.
Read Also: Online Transaction: గుడ్ న్యూస్.. డెబిట్-క్రెడిట్ కార్డ్‌ల వాడకానికి ఇకనుంచి సీవీవీ తప్పనిసరి కాదు
ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్లే మణిపుర్ హింసకు కారణమని గొగొయ్ ఆరోపించారు. మణిపుర్‌పై 30 సెకన్ల పాటు మాట్లాడేందకు మోడీకి 80 రోజులు ఎందుకు పట్టింది? అని ఆయన ప్రశ్నించారు. ఇంత జరిగినా మణిపూర్ సీఎంను ఎందుకు పదవి నుంచి తొలగించలేదు అని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ అడిగారు. మణిపూర్ వీడియోలు బయటకు రాకుంటే మోడీ పెదవి విప్పేవారే కాదని అన్నారు. మణిపూర్‌లో ఇంత జరుగుతుంటే భద్రతాదళాలు ఏం చేస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. మణిపూర్ అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని సుప్రీంకోర్టు కూడా తప్పుబట్టిందని గౌరవ్ గొగొయ్ గుర్తు చేశారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు