Nama Nageswara Rao: దమ్ము ధైర్యం ఉంటే కాళేశ్వరనికి ఎంత ఇచ్చారో చెప్పాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nama Nageswara Rao: దమ్ము ధైర్యం ఉంటే కాళేశ్వరనికి ఎంత ఇచ్చారో చెప్పాలని బీఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు కేంద్రానికి ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక్క రూపాయి ఇచ్చినట్లు నిరూపిస్తే BRS ఎంపీలం రాజీనామాలు చేస్తామన్నారు. 86 వేల కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇచ్చామని నిషికాంత్ దుబే అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధిని చూడలేక ఓర్వ లేక ఆ అభివృద్ధికి మేమే నిధులిచ్చాం అంటున్నారని అన్నారు. రూల్ 222 ప్రకారం నిషికాంత్ దుబే పై సభను తప్పుడోవ పట్టించినందుకు స్పీకర్ కు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చామన్నారు. పార్లమెంట్ లో అవిశ్వాసం ఇచ్చామన్నారు. అవిశ్వాసంపై చర్చ సందర్భంగా తెలంగాణకు అన్యాయం చేశారని చర్చ సందర్భంగా అన్ని వివరాలు చెప్పామని తెలిపారు. తెలంగాణ రాక ముందు తాగు నీరు సాగు నీరు ఉండేది కాదన్నారు. 9 ఏళ్లలో కేసిఆర్ తాగు నీటికి సాగు నీటి కోసం మిషన్ కాకతీయ, మిషన్ భగీరద ద్వారా నీరందించారని అన్నారు. కేంద్రం తెలంగాణ పట్ల కక్షతో ఉన్నారని అన్నారు. విభజన చట్టం ప్రకారం చేయాల్సినవి కూడా చేయలేదన్నారు. అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల్సిన అవసరం కేంద్రం పై ఉందన్నారు.
Read also: Jailer: క్యామియోలని ఇలా వాడితే… రిజల్ట్ ఈ రేంజులో ఉంటుంది
Also Read
- Bhatti Vikramarka: ‘హట్టి గోల్డ్ మైన్స్’ సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.!
- ACB Raids: భారీగా అక్రమ ఆస్తులు బట్టబయలు.. గనుల శాఖ అధికారి జయరాజ్ అరెస్ట్.!
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- Bhatti Vikramarka : కర్ణాటకలో గోల్డ్ హంట్.. దేవదుర్గ గనిపై భట్టి ఫోకస్..
తెలంగాణకి ఒక్క మెడికల్ కళాశాల, ఒక్క నవోదయ స్కూల్ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. తెలంగాణ పట్ల కేంద్రం ఎలా వ్యవహరిస్తుందో అన్ని అవిశ్వాసంపై చర్చ సందర్భంగా ప్రస్తావించా అన్నారు. నా మైక్ కట్ చేసి నిషికాంత్ దుబే కి పాయింట్ ఆఫ్ ఆర్డర్ కింద అవకాశం ఇచ్చారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు అనుమతులు, క్లియరెన్స్ ఇవ్వలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ను మూడు సంవత్సరాలలో మొత్తం పూర్తి చేశారని గుర్తు చేశారు. ప్రపంచంలో పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఇది అని అన్నారు. సిడబ్ల్యుసి డిపిఆర్ ప్రకారం 80 వేల కోట్లు, కానీ 86 వేల కోట్లు ఇచ్చాం అంటున్నారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అయిన ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే పెట్టుకుంది..కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇవ్వలేదని తెలిపారు. పార్లమెంట్ ప్రశ్నోత్తరాలలో కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ కు రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు చేసిందని చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దమ్ము ధైర్యం ఉంటే కాళేశ్వరనికి ఎంత ఇచ్చారో చెప్పాలి? అని ప్రశ్నించారు. ఒక్క పైసా ఇచ్చి నట్లు చూపిస్తే మేము దేనికైనా రెడీ అని సవాల్ విసిరారు. కులాలు, మతాల మధ్య చిచ్చులు పెట్టె వారిని ప్రజలు తెలంగాణ దరిదాపులకు రానియవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ నెంబర్ వన్ గా ఉందన్నది నచ్చక తప్పుడు మాటలు మాట్లాడారని మండిపడ్డారు.
Asaduddin Owaisi: దేశంలో ముస్లింలపై విద్వేష వాతావరణం సృష్టిస్తున్నారు..
తాజావార్తలు
-
Irumudi: మాస్ మహారాజా రవితేజ ఊచకోత.. 135 కోట్లతో ‘ఇరుముడి’ ఫస్ట్ వీక్ సెన్సేషన్!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Nepal Floods: నేపాల్ వరదలు.. కొట్టుకొచ్చిన బంగారం, వెండి, డబ్బులు..
-
Nepal Floods: 90 నిమిషాల్లో నేపాల్‌కు పెను ముప్పు.. మరో సరస్సు బద్ధలయ్యే ఛాన్స్..
-
Raviteja: ‘ఇరుముడి’ విధ్వంసం.. వివేక్ ఆత్రేయతో మాస్ మహారాజా క్రేజీ ప్రాజెక్ట్ ఖరారు!
ట్రెండింగ్
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!