భారత దేశ వ్యాప్తంగా మణిపూర్ అల్లర్లపై రచ్చరచ్చ కొనసాగుతుంది. రోజుకో విషాదం ఆ రాష్ట్రంలో జరుగుతుంది. ఇక, పార్లమెంట్ వేదికగా మణిపూర్ లో జరుగుతున్న అల్లర్లపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. మణిపూర్ లో శాంతి నెలకొల్పే బాధ్యత తనదంటూ ఆయన హామీ ఇచ్చారు. మరోవైపు మణిపూర్ లో జరుగుతున్న సంఘటనపై అమెరికా సింగర్ మేరీ మిలి బెన్ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు.
Read Also: Health Tips : ఉదయాన్నే కాల్చిన వెల్లుల్లి రెబ్బలను తింటే ఏమౌతుందో తెలుసా?
మణిపూర్ రాష్ట్రంలో శాంతి నెలకొల్పే బాధ్యతను ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్నారు అని అమెరికా సింగర్ మేరీ మిలి బెన్ అన్నారు. ఈ సందర్భంగా మణిపూర్ సమస్యపై ఆమె.. ప్రధాని నరేంద్ర మోడీకి సపోర్ట్ ఇచ్చారు. ఆ రాష్ట్రంలో తల్లులు, కుమార్తెలు, మహిళలకు ప్రధాని మోడీ న్యాయం చేస్తారనే విశ్వాసం తనకు ఉందని స్పష్టం చేశారు. అలాగే, స్వాతంత్ర్య భారతావనిలో సత్యాన్ని తెలియజేయండి నాకు మోడీపై విశ్వాసం ఉంది అని మేరీ మిలి బేన్ అన్నారు. ఆయన కోసం నేను ప్రార్థిస్తున్నాను అని బేన్ పేర్కొన్నారు. అయితే, లోక్‌సభలో మోడీ సర్కార్‌పై అవిశ్వాసం వీగిపోయిన తర్వాత సింగర్ మిల్ బెన్ ఈ కామెంట్స్ చేశారు.
Read Also: Cm Jagan: నేడు అమలాపురంలో సీఎం జగన్ పర్యటన.. సున్నా వడ్డీ పథకం నిధుల విడుదల
అయితే, ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ అగ్రరాజ్యం అమెరికా పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలో అమెరికాలో ప్రముఖ గాయని మిల్ బెన్ భారత దేశ జాతీయ గీతం జనగణ మన పాడిన తర్వాత మోడీని కలిసి ఆయనకు పాదాభివందనం చేసుకుంది. ఈ సందర్బంగా తనకు మోడీపై ఉన్న అభిమానాన్ని ఆమె చాటుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
A night I will treasure forever. Performing for His Excellency Prime Minister Narendra Modi for the concluding event of the PM’s Official State Arrival Visit to the United States. See last night’s post for the official performance airing from @DDNewslive.
What I loved most… pic.twitter.com/RFUctGkh3l
— Mary Millben (@MaryMillben) June 24, 2023