Monsoon Session 2023: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాలకు ముందుగా కేంద్ర ప్రభుత్వం బుధవారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
ప్రతికూల అవగాహనతో ఏర్పడిన పొత్తులు ఎప్పుడూ విఫలమవుతాయని ఎన్డీయే సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఢిల్లీలోని అశోక హోటల్లో మంగళవారం జరిగిన ఎన్డీయే పక్షాల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్డీయేలో చేరిన కొత్త పార్టీలకు స్వాగతం పలికారు. అభివృద్ధి దిశగా దేశం ముందుకు సాగుతోందని.. అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవిస్తున్నామని మోడీ పేర్కొన్నారు.
దేశంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బెంగళూరులో 26 విపక్ష పార్టీలు సమావేశం కాగా.. అటు ఢిల్లీలో ఎన్డీయే కూటమి కూడా 38 పార్టీలతో తన బలాన్ని నిరూపించుకునే పనిలో నిమగ్నమైంది. ఈ రోజు ఢిల్లీలోని అశోక హోటల్లో ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో ఎన్డీయే కూటమి భేటీ జరిగింది.
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని ఇవాళ(శనివారం) యూఏఈకి వెళ్లారు. అయితే, భారత ప్రధాని నరేంద్ర మోడీ యూఏఈ పర్యటన సందర్భంగా దుబాయ్‌లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన బుర్జ్ ఖలీఫాపై త్రివర్ణ పతాకంతో పాటు మోడీ ఫోటోను ప్రదర్శించి గ్రాండ్‌గా వెల్ కమ్ పలికారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
భారత ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటన ముగించుకొని అటు నుంచి అటే యూఏఈకి వెళ్లారు. యూఏఈలో ఒకరోజు పర్యటన కొనసాగించనున్నారు. ఒక రోజు పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ అబుదాబీ చేరుకున్నారు.
అయితే, చంద్రయాన్-3 రాకెట్ విజయవంతం కావడంతో పలువురు ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేస్తున్నారు. తాజాగా.. ఈ ప్రయోగం విజయవంతంపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలియజేశారు. దేశ అంతరిక్ష చరిత్రలో చంద్రయాన్-3 కొత్త అధ్యాయాన్ని లిఖించింది అని ఆయన పేర్కొన్నారు. ప్రతి పౌరుడి ఆకాంక్షల్ని, కలల్ని ఇది నింగిలోకి మోసుకెళ్లింది.. మన శాస్త్రవేత్తల నిబద్ధతకు ఈ ప్రయోగమే నిదర్శనం అని ప్రధాని అన్నారు.
ఇతర దేశాలకు వెళితే మన రూపాయి చెల్లుబాటుకాకపోవడంతో.. మన కరెన్సీని అక్కడి స్థానిక కరెన్సీలోకి మార్చుకోవాల్సి వస్తోంది. ప్రస్తుతం చాలా దేశాల్లో ఇలాంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇక ఫ్రాన్స్ కి వెళ్లిన వారు అలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.
ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. మోడీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం లభించింది. ఆ దేశ అత్యున్నత గౌరవ పురస్కారంను ప్రధాని మోడీకి ఆ దేశ అధ్యక్షుడు అందించారు.