MP Laxman: మోడీ ముచ్చటగా మూడో సారి పీఎం అవుతారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. కేంద్రం ప్రకటించిన రైల్వే ప్రాజెక్టులపై తండ్రి కొడుకుల స్పందన ఏది? అని ప్రశ్నించారు. రైల్వే ప్రాజెక్టులతో తెలంగాణాకు మేలు జరగనుందని తెలిపారు. ట్విట్టర్ టిల్లు ఎందుకు స్పందించడం లేదు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
కేంద్రం నిర్ణయాలు కేటీఆర్ కు కనువిప్పు కలగాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణాలో అభివృద్ధి పనులకు ప్రధానిని ఆహ్వానిస్తామన్నారు.
పార్లమెంట్ లో మణిపూర్ అంశాన్ని అడ్డుపెట్టి ప్రతిపక్షాలు ఆందోళన చేశాయని మండిపడ్డారు. అవిశ్వాసాన్ని ప్రకటించిన విపక్ష కూటమికి పార్లమెంట్ లో చెంపపెట్టు జరిగిందని తెలిపారు. భవిష్యత్ ఎన్నికలలో వాళ్ళకు ప్రతిపక్ష పాత్రే అని అన్నారు. మోడీ ముచ్చటగా మూడో సారి పీఎం అవుతారని తెలిపారు.
Read also: Swathistha: రజినీ కోడలు కత్తి అనుకుంటే… కమల్ కోడలు అమ్మోరు కత్తిలా ఉందే…
తెలంగాణలో అధికారంలోకి రావడానికి ప్రత్యేక ప్రణాళిక వేస్తున్నామని అన్నారు. తెలంగాణలో ఉద్యమాలు, పోరాటాలు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేకతను బీజేపీ అనుకూలంగా మార్చుకోనుందని అన్నారు. నిన్నటి బీజేపీ ఎన్నికల కమిటీ మీటింగ్ లో తెలంగాణ అంశం చర్చ జరగలేదన్నారు. వంద రోజుల ప్రణాళికను తెలంగాణ లో అమలు చేస్తామన్నారు. గెలుపు గుర్రాలను బరిలో దించుతామన్నారు. కేసీఆర్ కు కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కాదన్నారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే బీఆర్ఎస్ కు వేసినట్లే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు. కేసీఆర్, కేటీఆర్ లు మోకాళ్ళ యాత్ర చేసినా ప్రజలు క్షమించరని కీలక వ్యాఖ్యలు చేశారు.
Fake Officer: నేను కేసు పెడితే సీఎం ఆపలేడు… పీఎం తెలిస్తే ట్రై చేయ్..