Vajpayee Death Anniversary: ఘనంగా మాజీ ప్రధాని వాజ్‌పేయి వర్ధంతి.. నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vajpayee Death Anniversary: మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. 5వ వర్థంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీలు సదైవ్ అటల్ స్మారకం వద్ద వాజ్‌పేయికి నివాళులర్పించారు. వారితోపాటు కేంద్రమంత్రులు, పలువురు రాజకీయ ప్రముఖులు, బీజేపీ నేతలు నివాళులర్పించారు. వాజ్‌పేయి నాయకత్వం నుంచి దేశం చాలా లబ్ధి పొందిందని ప్రధాని మోడీ తన సోషల్ మీడియా అకౌంట్ ట్విట్టర్‌లో తెలిపారు. దేశ ప్రగతిలో ఆయన క్రియాశీల పాత్ర పోషించారని.. అనేక రంగాలను 21వ శతాబ్ధం వైపు తీసుకువెళ్లారని పేర్కొన్నారు.
Read also: New Housing Scheme: స్వాతంత్ర్య దినోత్సవంగా సందర్భంగా ప్రధాని కానుక.. కొత్త గృహనిర్మాణ పథకం ప్రారంభం
Also Read
‘‘అటల్ జీ పుణ్య తిథి నాడు ఆయనకు నివాళులు అర్పించడంలో 140 కోట్ల మంది భారత ప్రజలతో నేను చేరుతున్నాను’’ అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఆయన నాయకత్వం నుంచి భారతదేశం చాలా లాభపడిందని అన్నారు. మన దేశ ప్రగతిని పెంచడంలో, విస్తృత శ్రేణి రంగాలలో 21వ శతాబ్దానికి తీసుకువెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. బీజేపీ మొట్టమొదటి ప్రధానమంత్రి అయిన వాజ్‌పేయి.. పార్టీ నిర్మాణంలో కీలకపాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. విశేష ప్రజాదరణ పొందిన ప్రజానాయకుడు వాజ్‌పేయి.. ఆరేళ్లపాటు సంకీర్ణ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపించి ఘనత సాధించారని తెలిపారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో దేశంలో సంస్కరణలు తీసుకురావడంతోపాటు.. మౌలిక సదుపాయాలను పెంచడానికి కృషి చేశారన్నారు. వాజ్‌పేయి తన 93 సంవత్సరాల వయస్సులో 2018లో మరణించారని గుర్తు చేసుకుని నివాళులర్పించారు.
I join the 140 crore people of India in paying homage to the remarkable Atal Ji on his Punya Tithi. India benefitted greatly from his leadership. He played a pivotal role in boosting our nation's progress and in taking it to the 21st century in a wide range of sectors.
— Narendra Modi (@narendramodi) August 16, 2023
తాజావార్తలు
-
Ganesh Procession Tragedy: వినాయకుడి ఊరేగింపులో విషాదం.. జనరేటర్ ఫ్యాన్‌కు జుట్టు చిక్కుకుని బాలిక మృతి
-
Shreyas Iyer: అప్పుడు చాలా బాధేసింది.. ఏం చేయాలో అర్థం కాలేదు.. ఇప్పుడు ఫుల్ హ్యాపీ!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
CM Chandrababu: ఆరు నెలల్లో 5.52 లక్షల ఇళ్లను పూర్తి చేయాలి.. సీఎం కీలక ఆదేశాలు
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
ట్రెండింగ్
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?