ప్రధాని నరేంద్ర మోడీని దక్షిణాదిలోని ఏ రాష్ట్రం నుంచి పోటీ చేయించాలనే దానిపై బీజేపీ కసరత్తు స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కర్ణాటకలోని బెంగళూరు సిటీలో ఉన్న ఎంపీ సీట్లలో కానీ, తెలంగాణలోని సికింద్రాబాద్ వంటి సీటు నుంచి కానీ.. లేదా తమిళనాడు నుంచి కానీ పోటీ చేయించేందుకు అన్వేషణ చేస్తున్నారు. ఈ కసరత్తు త్వరలో పూర్తి చేసి మోడీ పోటీ చేసే నియోజకవర్గాన్ని ముందే ప్రకటించేందుకు బీజేపీ హైకమాండ్ ప్రయత్నాలు చేస్తుంది.
ఈ ఏడాది పలు రాష్ట్రాల్లో జరుగనున్న ఎన్నికల నేపథ్యంలో కేంద్రమంత్రి వర్గ విస్తరణ మరో రెండు మూడు రోజుల్లో జరిగే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది. వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో కొత్త మంత్రులు పాల్గొనేలే బీజేపీ హైకమాండ్ నిర్ణయాలు తీసుకోవాలని భావించినట్లు తెలుస్తుంది. పార్లమెంటు సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభం కానున్నాయి. అయితే, ఈ సమావేశాలకు ముందే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫ్రాన్స్లో పర్యటించనున్నారు.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులకు ఇవాళ( సోమవారం) ఫోన్ లో మాట్లాడారు. ఉత్తర భారత దేశంలో గత నాలుగైదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లలో భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వరదల దెబ్బకు రహదారులు తెగిపోయాయి. ఆయా ప్రాంతాలు, గ్రామాలు నీటిలోనే ఉన్నాయి. భారీగా కురుస్తున్న వర్షాలకు పెద్ద పెద్ద భవనాలు కూడ పేకమేడలా కూలిపోతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో…
ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల నియంత్రణపై కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ పై ఇవాళ (సోమవారం) సుప్రీంకోర్టు విచారణ చేసింది. ఈ ఆర్డినెన్స్ ను సవాల్ చేస్తూ ఢిల్లీ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఇవాళ పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం విచారించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
వరంగల్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రం, ముఖ్యమంత్రి కేసీఆర్ పై చేసిన ఆరోపణలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మేము అవినీతి చేశామని ప్రధాని మోడీ అంటున్నారు కదా.. దర్యాప్తు సంస్థలు అన్నీ మీ చేతిలో ఉన్నాయి కదా?.. ఏమి చేస్తున్నారు?.. మీరు అని ఆయన ప్రశ్నించారు.
రాజస్థాన్లోని బికనీర్లో తన బహిరంగ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అంటే దోపిడీ దుకాణం, అబద్ధాల మార్కెట్ అని ప్రధాని మోడీ విమర్శలు గుప్పించారు.
ప్రతిపక్ష పార్టీలను, ప్రభుత్వాలను కూల దొస్తున్న ఘనత ప్రధాని మోడీకే దక్కుతుంది అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు రంగాల్లో 1, 2, 3 స్థానాల్లో ముందుంది అని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రభాగాన నిలబెట్టిన ఘనత సీఎం కేసీఆర్ కి దక్కుతుందన్నారు. ప్రధాని స్థాయి దిగజారి మా ముఖ్యమంత్రిని, ఆయన కుటుంబంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని గుత్తా మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్రంపైన, సీఎం కేసీఆర్ పైన ప్రధాన మంత్రి మోడీ చేసిన వాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను అని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. బీజేపీ పార్టీలో అనేక మంది కుటుంబ సభ్యులు ఎంపీలుగా ఉన్నారు.. అవినీతి ప్రభుత్వం బీఆర్ఎస్ అంటున్నారు.. ఎక్కడ అవినీతి ఉందొ తెల్వదా?.. అని వినోద్ కుమార్ అడిగారు.
వరంగల్ లోని బీజేపీ నిర్వహించిన సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సీఎం కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలకు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. ఈ సభలో మోడీ పచ్చి అబద్ధాలు మాట్లాడారు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అస్సలు తెలంగాణ ఉద్యమంలో మోడీ పాత్ర ఎంటి..?, మోడీయే విశ్వాస ఘతకుడు.. ద్రోహి అద్వానీ, వెంకయ్య నాయుడులను అతను తొక్కి వేశారు అంటూ ఆరోపించారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రతి పథకం పేరు మార్చి మోడీ ప్రభుత్వం కాపీ కొట్టిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. మేం పని మంచిగా చేయకపోతే ఎందుకు మా పథకాలను కాపీ కొట్టారు.. ఎందుకు ఢిల్లీలో అవార్డులు ఇస్తున్నారు అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణకు పెట్టుబడులు వస్తున్నాయి అని ప్రధాని మోడీ అంటున్నారు.. పెట్టుబడులు వస్తున్నాయి అంటే కేసీఆర్ గొప్పతనం అని మంత్రి పేర్కొన్నారు.