JDS: మాజీ ప్రధాని దేవెగౌడ పార్టీ జనతా దళ్ సెక్యులర్(జేడీఎస్) రేపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కర్ణాటక మాజీ సీఎం, దేవెగౌడ కొడుకు కుమారస్వామి గురువారం పార్లమెంట్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమైనట్లు తెలుస్తోంది. 2024 లోక్సభ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. ఇప్పటికే ఈ దిశగా సీట్ల పంపకాలపై కూడా ఇరు పార్టీలు ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ క్రేజ్ మామూలుగా లేదు. సోషల్ మీడియా ఫ్లాట్పాం ఎక్స్(ట్విట్టర్), ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో రికార్డు స్థాయిలో మోడీకి ఫాలోవర్లు ఉన్నారు. ఇదిలా ఉంటే ప్రధాని మోడీ బుధవారం తన వాట్సాప్ ఛానెల్ క్రియేట్ చేశారు. ఒక్క రోజులోని రికార్డు స్థాయిలో మిలియన్ సబ్స్క్రైబర్లను దాటింది.
Asaduddin Owaisi: కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ విరుచుకుపడ్డారు. ఇది కేవలం "సవర్ణ మహిళల"(అగ్రకుల మహిళలు) కోసమే ప్రవేశపెట్టిన బిల్లుగా అభివర్ణించారు. ఓబీసీ మహిళలకు, మహిళా కోటాలో రిజర్వేషన్ ఇవ్వనందుకు కేంద్రం తీరును తప్పుపట్టారు. ఎంఐఎం ఈ బిల్లును వ్యతిరేకిస్తుందని చెప్పారు. మహిళా బిల్లును ‘‘చెక్ బౌన్స్ బిల్లు’’, ‘‘ఓబీసీ, ముస్లిం మహిళ వ్యతిరేక బిల్లు’’గా విమర్శించారు.
2024 గణతంత్ర వేడుకలకు అమెరికా అధ్యక్షుడు జోబ బైడెన్ ని ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించారని అమెరికా రాయబారి తెలిపారు. దీంతో భారత్-అమెరికాల మధ్య బంధం మరింగా బలపడే అవకాశం ఏర్పడుతుంది.
India vs Canada: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలో హత్యకు గురయ్యాడు. ఈ హత్యవెనక భారత్ ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అక్కడి పార్లమెంట్ లో ఆరోపించడం వివాదాస్పదమైంది. అంతేకాకుండా అగ్రశ్రేణి భారత దౌత్యవేత్తను కెనడా బహిష్కరించింది. దీనికి ప్రతిగా భారత్ కూడా కెనడా సీనియర్ దౌత్యవేత్తను 5 రోజుల్లో భారత్ వదిలి వెళ్లాలని ఆదేశించింది. కెనడా వ్యాఖ్యలు పూర్తిగా అసంబద్ధ, ప్రేరేపిత వ్యాఖ్యలని భారత్ ఖండించింది.
Women’s Reservation Bill: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని రామచంద్రపురం పట్టణంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి రాష్ట్ర బిజెపి సీనియర్ నాయకులు డాక్టర్ సి అంజిరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గోదావరి అంజిరెడ్డి, పలువురు మహిళలు పాలాభిషేకం నిర్వహించారు.
దేశంలో నరేంద్ర మోడీ 3.50 కోట్ల ఇళ్లను కట్టించాడని మన పక్క రాష్ట్రమైన ఏపీలో 20 లక్షల ఇల్లు కట్టించాడని సర్వేలు చెప్తున్నాయని ఈటెల రాజేందర్ అన్నారు. పేద ప్రజలకు సొంత ఇంటి కల నెరవేర్చకుండా పేదల కళ్ళల్లో కేసీఆర్ ప్రభుత్వం మట్టి కొట్టిందని ఆయన ఆరోపించారు.
మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఖమ్మం, కొత్తగూడం వాళ్లతో ఇదే ప్రాబ్లం.. బీజేపీ చేసింది ఏమీ లేదు.. అటెన్షన్ డ్రైవర్షన్ చేసి ఓట్లతో గట్టెక్కాలని చూస్తుంది.. సమాజాన్ని కులం, మతం పరంగా విభజించాలని చూస్తుంది.. మతం పేరుతో మంట పెట్టి ఆ మంటలలో చలికాపుకోవాలని బీజేపీ చూస్తుందన్నాడు.