తెలంగాణ-ఏపీ విడిపోయినప్పుడు సంబరాలు చేసుకోలేదని ప్రధాని మోడీ చెప్పారు.. మోడీ కడుపులో ఉన్న విషాన్ని బయటికి కక్కుతున్నారు అని మంత్రి హరీశ్ రావు అన్నారు. మనకి రావాల్సిన ప్రాజెక్టును ఆంధ్రకు తీసుకుపోయారు.. బీజేపీవి అన్ని అబద్ధాలే.. మాకు జాతీయ ప్రాజెక్టు ఇచ్చారా.. మాపై విష ప్రచారాలు మానుకోవాలి అంటూ ఆయన విమర్శించారు.
తెలంగాణ అమరవీరులు, వారి త్యాగాలపై పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన అగౌరవ వ్యాఖ్యలు రాష్ట్ర అస్తిత్వం, ఆత్మగౌరవాన్ని అవమానించడమే తప్ప మరొకటి కాదని ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ మంగళవారం అన్నారు.
పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి సపోర్ట్ ఇస్తుందని బీఆర్ఎస్ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ కే. కేశవరావు అన్నారు. బిల్లుకు మేం 100 శాతం మద్దతు ఇస్తామన్నారు.
ఏపీ విభజనపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన కామెంట్స్ ను తప్పుబడుతూ కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. దీంతో రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ స్పందించారు. మీ స్క్రిప్ట్ రైటర్ ను మార్చుకోండి పప్పు జీ అంటూ రాహుల్ గాంధీని ఉద్దేశించి నెట్టింట ఓ పోస్ట్ చేశాడు.
తెలంగాణ ప్రకటించినప్పుడు కేసీఆర్ పార్లమెంట్ లో లేడు, మహిళా రిజర్వేషన్ బిల్లు వస్తున్నప్పుడు కవిత ఎంపీ కాదు, అయినా ఆ ఘనత మీదే అన్నట్లు చెప్పుకోవాలని చూడటం హాస్యాస్పదం.. కవిత ఓడిపోయింది కాబట్టి సరిపోయింది కానీ, లేదంటే తానే తెచ్చినట్టు డప్పు కొట్టుకుని జనం చెవుల్లో పూలు పెట్టేది అంటూ ఆయన రాసుకొచ్చారు.
ప్రధాని నరేంద్ర మోడీ, వీఐసీలు కోసం ప్రత్యేకంగా రూపొందించిన శాటిలైట్ లేదా రిస్ట్రిక్టెడ్ ఏరియా ఎక్స్ఛేంజ్ ఫోన్ లను వినియోగిస్తారు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెట్ ద్వారా తయారు చేసిన నవరత్న పీ.ఎస్.యూ( PSU ) అన్ని ఇతర కమ్యూనికేషన్ల కోసం స్పెషల్ గా ఎన్క్రిప్ట్ చేయబడిన ఫోన్ ని మాత్రమే మోడీ ఆయన ప్రధాన కార్యదర్శి ద్వారా వాడుతుంటాడు.
Women's Reservation Bill: దాదాపుగా మూడు దశాబ్ధాల కల, మోదీ ప్రభుత్వం నెరవేర్చబోతోంది. మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టనున్నట్లు ప్రధాని వెల్లడించారు. మహిళా బిల్లుకు ‘నారీ శక్తి వందన్ అధినియం’గా పేరు పెట్టారు. ఈ బిల్లు ద్వారా మహిళలకు పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీల్లో 33 శాతం కోటా రిజర్వేషన్ గా ఇవ్వనున్నారు.
PM Modi: ఆటల నుంచి అంతరిక్షం వరకు అన్ని రంగాల్లో మహిళలు ముందున్నారని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. మహిళా బిల్లు చాలా రోజులుగా పెండింగ్ ఉందని, నేడు చరిత్రలో నిలిచిపోయే రోజు వచ్చిందన్నారు.
New Parliament Building: కొత్త పార్లమెంట్ భవనంలో సభ కొలువుదీరింది. మోడీ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భవనంలోకి ఎంపీలంతా ఎంట్రీ ఇచ్చారు. ప్రధాని మోడీ కేంద్రమంతులు పీయూష్ గోయల్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లద్ జోషిలతో పార్లమెంట్ లోకి ఎంట్రీ ఇచ్చారు. బీజేపీతో పాటు కాంగ్రెస్, ఇతర విపక్షాల ఎంపీలు కొత్త పార్లమెంట్ భవనంలో సభకు హాజరయ్యారు.
Old Parliament: దశాబ్ధాల చరిత్ర కలిగిన పార్లమెంట్ భవనం నేటితో రిటైర్ కాబోతోంది. ఎన్నో రాజకీయాలకు సాక్ష్యంగా మిగిలిన పాత పార్లమెంట్ భవనంలో ఇకపై అధ్యక్ష అనే మాటలు వినిపించవు. ఈ రోజు కొత్త పార్లమెంట్ భవనంలోకి సభ మారబోతోంది.