Etela Rajender: కేసీఆర్ ఎన్డీఏలో చేరాలనుకున్న మాట వాస్తవం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కేసీఆర్ ఎన్డీఏలో చేరాలనుకున్న మాట వాస్తవమేనని ఆయన పేర్కొన్నారు. విశ్వాసానికి మారుపేరు మోడీ.. విశ్వాస ఘాతకానికి మారుపేరు కేసీఆర్ అంటూ మండిపడ్డారు. కవితను గెలిపిస్తే వంద రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామన్నారు.. ఈనాటికి షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ కాలేదు.. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తామని బీజేపీ మ్యానిఫెస్టోలో పెట్టలేదు.. తెలంగాణ రైతులకు ఎరువుల కొరత లేకుండా నరేంద్ర మోడీ ఎరువుల ఫ్యాక్టరీ ఓపెన్ చేశారు అని ఆయన తెలిపారు. 2005లో కేంద్ర మంత్రిగా కేసీఆర్ ఉన్న సమయంలో సిద్దిపేట–సికింద్రాబాద్ రైల్వే లైన్ లాలూ ప్రసాద్ 350 కోట్ల రూపాయలు పెట్టారు.. 2016 వరకు ఒక్కపైసా ఖర్చు చేయలేదు అని ఈటెల రాజేందర్ ఆరోపించారు.
Read Also: Flpkart: ఫ్లిప్‌కార్ట్ ప్రకటనతో తప్పుదోవ పట్టించిన అమితాబ్ బచ్చన్.. రూ.10 లక్షల జరిమానా
Also Read
- US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
- 2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
- North Korea vs South Korea: సరిహద్దులో ఉద్రిక్తత.. దక్షిణ కొరియాకు కిమ్ సోదరి వార్నింగ్
- Astrology: సెప్టెంబర్ 30 బుధవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లించండి.. అంతా శుభమే..!
కేంద్ర ప్రభుత్వం అతి తక్కువ కాలంలో సిద్దిపేట–సికింద్రాబాద్ రైల్వే లైన్ పూర్తి చేశారు అని ఈటెల రాజేందర్ అన్నారు. బాధ్యత కలిగిన మంత్రి హరీశ్ రావు, ప్రధాని ప్లెక్సీని చించేశారు.. టీవీని పగలగొట్టి కుసంస్కారానికి ఒడిగట్టారు.. గృహలక్ష్మీ పథకం కింద మూడు లక్షల రూపాయలు ఇచ్చే టైం ఉందా? అని ఆయన ప్రశ్నించారు. కండువా కప్పుకుంటే.. బీసీ బంధు ఇస్తామని హామీలు ఇస్తున్నారు.. కేసీఆర్ మాటలకు మోస పోతే గోస పడుతారు.. ప్రధానిని టూరిస్ట్.. చీటర్ అని అంటున్నారు.. దుబ్బాక ప్రజలు బీఆర్ఎస్ కు కర్రుకాల్చి వాత పెట్టారు అని ఈటెల రాజేందర్ చెప్పారు.
Read Also: Minister KTR: కాంగ్రెస్ పై కేటీఆర్ ఫైర్.. 11 సార్లు ఛాన్స్ ఇస్తే మీరేం చేశారు?
10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్ని కుటుంబాలకు దళిత బంధు ఇచ్చారు అని ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. దళితుడిని సీఎం చేస్తామని ఎందుకు చేయలేదు.. చీటింగ్ లో కేసీఆర్ నెంబర్ వన్.. కరప్షన్ ఫ్రీ స్టేట్ అంటున్నారు.. బీఆర్ఎస్ పార్టీకి 900 కోట్ల రూపాయల వైట్ మనీ ఎలా వచ్చింది.. హుజురాబాద్ లో 600 కోట్ల ఎలా ఖర్చు పెట్టారు? అని ఆయన అడిగారు. ప్రధాని నరేంద్ర మోడీ సమాచారం లేకుండా మాట్లాడతారా?, దేశంలో ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎంత డబ్బులు పంపించారో తెలియదా?, ఎన్నికల ఖర్చులు చూసుకుంటాను.. తనకు మద్దతు ఇవ్వాలని కొన్ని రాజకీయ పక్షాలను కోరిన మాట వాస్తవం కాదా? అని ఈటెల రాజేందర్ ప్రశ్నించారు.
Read Also: Anushka Sharma Post: ప్రెగ్నెంట్ రూమర్స్.. అనుష్క శర్మ ఇన్‌స్టా స్టోరీ వైరల్!
దళితుడికి ఎస్సీ వెల్ఫెర్, బీసీకి బీసీ వెల్ఫెర్ మంత్రి పదవులు ఇచ్చి సరిపెడతారని ఈటెల రాజేందర్ అన్నారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు ఇరవైళ్లుగా కేసీఆర్ చేతిలోనే ఉంది.. భవిష్యత్ లో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులే ఉంటారు.. ముఖం బాగాలేక అద్దం పగలకొట్టుకున్నట్లు ఉంది కేసీఆర్ తీరు.. గురువింద గింజ నలుపు ఎరుగనట్లు ఉంది కేసీఆర్ తీరు.. గిరిగీసి బరిలో కొట్లడటానికి బీజేపీ సిద్ధంగా ఉంది అని ఆయన మండిపడ్డాడు. తెలంగాణ ప్రభుత్వం అపసవ్యంగా నడుస్తుందనే నరేంద్ర మోడీ కేసీఆర్ ను దూరం పెట్టారు.. 2018లో ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ ఎందుకు వెళ్లాలో చెప్పాలి.. 2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డిని ఓడించడానికి ఎన్ని కుట్రలు చేశారో నాకు తెలుసు అని ఈటెల రాజేందర్ అన్నారు.
తాజావార్తలు
-
US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
-
Explainer: భారీ షాక్.. అక్టోబర్ 1 నుంచి పెరగనున్న ధరలు!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
North Korea vs South Korea: సరిహద్దులో ఉద్రిక్తత.. దక్షిణ కొరియాకు కిమ్ సోదరి వార్నింగ్
-
NC 25 : నాగచైతన్య 25వ సినిమాపై ఆ పుకార్లు నమ్మొద్దు
ట్రెండింగ్
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!