Tamilisai:మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినందుకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం సోమవారం ఆమోదం తెలిపింది.
Parliament special session: వందేళ్ల నాటి కట్టడం, భారతదేశ భవిష్యత్తు, అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి చిరునామా నిలిచిన పార్లమెంట్, నేడు కొత్త భవనంలోకి తరలివెళ్తోంది. ఎన్నోచర్చలు, భావోద్వేగాలు, ఉగ్రవాద దాడికి కూడా ఈ బ్రిటీష్ హయాంలోని కట్టడం సాక్ష్యంగా నిలిచింది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా మోడీ సర్కార్ కొత్త పార్లమెంట్ని నిర్మించింది. తాజాగా ఈ రోజు నుంచి కొత్త పార్లమెంట్ భవనంలోకి సభ మారనుంది. ఇప్పటి నుంచి కొత్త పార్లమెంట్ దేశ భవిష్యత్తుకు కొత్త చిరునామా కానుంది.
UNESCO: యునెస్కో(UNESCO) ప్రపంచ వారతసత్వ సంపదలో మరో రెండు భారతీయ ప్రదేశాలకు చోటు లభించింది. దీంతో భారత్ నుంచి ఈ జాబితాలో వారసత్వ గుర్తింపు పొందిన ప్రదేశాల సంఖ్య 42కి చేరింది. కర్ణాటక హొయసల రాజవంశానికి చెందిన ఆలయాలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. అంతకుముందు రోజు పశ్చిమబెంగాల్ రవీంద్రనాథ్ ఠాగూర్ ‘శాంతినికేతన్’ని వారసత్వ సంపదగా గుర్తించింది యునెస్కో(UNESCO). ఈ విషయాన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) తెలిపింది.
Women's Reservation Bill: మోడీ నేతృత్వంలో జరిగిన కేంద్ర క్యాబినెట్ నిన్న సంచలన నిర్ణయం తీసుకుంది. దశాబ్ధాలుగా ఉన్న మహిళా బిల్లుకు కీలక ముందడుగు పడింది. పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించబడిన మహిళా బిల్లుకు కేంద్ర పచ్చజెండా ఊపింది. మరో నేటి నుంచి మరో నాలుగు రోజులు జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ బిల్లును తీసుకురాబోంది.
Asaduddin Owaisi: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రతిపక్ష ఇండియా కూటమిపై ఫైర్ అయ్యారు. సోమవారం ఓ కార్యక్రంలో మాట్లాడుతూ తీవ్ర విమర్శలు చేశారు. ఈ కూటమిలోకి తమను ఆహ్వానించకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Canada: కెనడా-భారత మధ్య ఖలిస్తానీ చిచ్చు ఆరడం లేదు. రెండు దేశాల మధ్య ఇప్పటికే దౌత్యసంబంధాలు అనుమానంతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కెనడా ప్రధాని భారత్ వ్యతిరేఖంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది హత్యలో భారత్ పాత్ర ఉందంటూ సంచలన ఆరోపణలు ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తత మొదలైంది.
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది. సాయంత్రం భేటీ అయిన మంత్రివర్గం.. పలు కీలక అంశాలపై దాదాపు 2 గంటల పాటు చర్చించింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న పలు బిల్లులకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.
ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ అనెక్స్లో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఈ కీలక కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతోంది. సమావేశం ఎజెండా ఇంకా వెల్లడి కానప్పటికీ, ప్రత్యేక సమావేశంలో పరిశీలన కోసం జాబితా చేయబడిన కీలక బిల్లులపై చర్చ జరిగే అవకాశం ఉంది.
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ విభజన సరిగ్గా జరుగలేదని పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాన మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేశాయని మంత్రి కేటీఆర్ అన్నారు.