CM YS Jagan Delhi Tour: సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ.. అదే ప్రధాన కారణం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM YS Jagan Delhi Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి బుధవారం నుంచి రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి సీఎం జగన్ బయలుదేరతారు. పదిన్నరకు గన్నవరం విమానాశ్రయం చేరుకుని ప్రత్యేక ఫ్లైట్ లో కోసం ఢిల్లీకి పయనం అవుతారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఢిల్లీకి చేరుకుంటారు. సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలతో సీఎం జగన్ భేటీ అవనున్నట్లు సమాచారం. ఈ ఇద్దరితో కీలక భేటీ తర్వాత రాత్రికి ఢిల్లీలోనే బస చేస్తారు.
గురువారం ఉదయం 10 గంటలకు విజ్ఞాన్ భవన్ కు వెళతారు సీఎం జగన్. హోమ్ మంత్రి అమిత్ షా నేతృత్వంలో జరుగనున్న మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. దేశంలో పది మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, కేరళ, మధ్యప్రదేశ్, ఛత్తీశ్ ఘడ్, జార్ఘండ్, పశ్చిమ బెంగాల్, బీహార్ పాల్గొననున్నాయి. ఈ సమావేశానికి ముఖ్యమంత్రులతో పాటు ఆయా రాష్ట్రాల సీఎస్ , డీజీపీలు, సంబంధిత కేంద్ర శాఖల ఉన్నతాధికారులు కూడా హాజరుకానున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొని రాష్ట్రంలోని పరిస్థితులు, గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ఈ సమావేశం తర్వాత గురువారం కూడా ముఖ్యమంత్రి ఢిల్లీలోనే బస చేసే అవకాశాలు ఉన్నాయి. అందుబాటులో వున్న ఇతర కేంద్ర మంత్రులతో కూడా ముఖ్యమంత్రి భేటీ అవనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఖరారు అయ్యే అపాయింట్ మెంట్లను బట్టి గురువారం రాత్రికి తిరిగి విజయవాడకు వచ్చే అవకాశం ఉంది. లేని పక్షంలో ఈనెల 7న ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ముగించుకుని తాడేపల్లికి తిరిగి వస్తారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోమ్ మంత్రి అమిత్ షాతో జరిగే సమావేశంలో ఏ అంశాలు చర్చకు వస్తాయన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!