కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. అక్టోబర్ 3న నిజామాబాద్ జిల్లాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటించనున్నారు అని తెలిపారు. 8 వందల మెగా వాట్ల విద్యుత్ ప్రాజెక్ట్ కు ఆయన వర్చువల్ గా ప్రారంభోత్సవం చేయనున్నారు. లక్ష మందితో సభ నిర్వహిస్తున్నాం.. ఉత్తర తెలంగాణలో బీజేపీ కీలక పాత్ర వహించబోతుంది.. ఖమ్మంలో కూడా పార్టీ బలపడింది.. మోడీ పర్యటన రాష్ట్ర రాజకీయాలకు దిశా నిర్దేశంగా ఉండబోతుంది అని ఆయన అన్నారు.
కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకోవడంలో ఫిట్ అని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో అన్ ఫిట్ అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు.
గత 30 రోజుల్లో భారత దౌత్యం కొత్త శిఖరాలను తాకిందని, జీ20 సదస్సులో తీసుకున్న కొన్ని నిర్ణయాలు 21వ శతాబ్దపు ప్రపంచం దిశను మార్చే అవకాశం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం అన్నారు.
వివిధ ప్రభుత్వ శాఖల్లో కొత్తగా నియమితులైన ఉద్యోగులకు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దాదాపు 51,000 అపాయింట్మెంట్ లెటర్లను పంపిణీ చేయనున్నారు.
ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. తెలంగాణకు వచ్చే ముందు ప్రధాని మోడీ ఇచ్చిన హామీలు అమలు చేయాలి అని డిమాండ్ చేసింది. కాళేశ్వరానికి జాతీయ హోదా, నిజామాబాద్ లో పసుపు బోర్డు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, విభజన చట్టంలో ఇచ్చిన హామీలపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించాలి అని కవిత అన్నారు.
కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోడీ విరుచుకుపడ్డారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పాలించిన ప్రతి రాష్ట్రాన్ని నాశనం చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్లోని భోపాల్లోల బీజేపీ నిర్వహించిన ర్యాలీలో ప్రధాని పాల్గొన్నారు.
కేంద్రంలో బీజేపీ సర్కార్ వచ్చాక వ్యవస్థలు అన్ని ధ్వంసం అయ్యాయని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. దేశంలో ఎక్కడ చూసిన ప్రతిపక్షాలపై ఈడీ, ఐటీ దాడులు జరుగుతున్నాయి..
PM Modi: దీనిని చరిత్ర గుర్తుంచుకుంటుందని అన్నారు. మన్ కీ బాత్ లో మాట్లాడిన ప్రధాని పురాతన కాలంలో భారత్ వాణిజ్య శక్తిగా ఉన్న సమయంలోని ‘సిల్క్ రూట్’ వాణిజ్య కారిడార్ని గుర్తు చేశారు. ఇండియానే ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ ని ఇటీవల జరిగిన జీ20 సదస్సులో సూచించిందని ప్రధాని అన్నారు. చంద్రయాన్-3 విజయం తర్వాత జరిగిన జీ20 సదస్సు ప్రతీ భారతీయుడి ఆనందాన్ని రెట్టింపు చేసిందని ఆయన పేర్కొన్నారు.