మోడీ నిన్న బహిరంగ సభలో ప్రధాని అనే విషయం మరిచి చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. ఇవాళ ఆయన జనగామ జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. మోడీ రాజకీయం కోసం ఇంతగా దిగజారుతడని అనుకోలేదన్నారు. యావత్ సమాజాన్ని అగౌరవ పరిచే విధంగా మాట్లాడటం సిగ్గుచేటు, యావత్ తెలంగాణ దీన్ని తీవ్రంగా ఖండించాలన్నారు కడియం. పీఎం, సీఎం కాన్ఫిడెన్సియల్ విషయాలు పబ్లిక్ గా మాట్లాడటం సరికాదని, కేటీఆర్ సీఎంపై సీఎల్పీ ఎన్నుకొంటే సీఎం అయితరన్నారు. ప్రధాని సీఎం చేసే వ్యవస్థ మన దేశంలో లేదని ఆయన అన్నారు. మోడీ జ్ఞానం పరిధి ఏందో అర్థం అవుతుందని కడియం శ్రీహరి విమర్శించారు. తెలంగాణను అపహాస్యం చేసే విధంగా మాట్లాడుతూన్నారని ఆయన మండిపడ్డారు. కళ్లులేని కబోదిలా మోడీ మాట్లాడుతున్నారని, మోడీకి సిగ్గు శరం ఉంటే విభజన హామీలు ఎందుకు అమలు చేయట్లే…. ఎందుకు తోక్కిపెట్టారని ప్రశ్నించారు. తెలంగాణకు 9 సంవత్సరాల్లో నువ్వు చేసిన మేలు ఏంటి? అని ఆయన ప్రశ్నించారు.
Also Read : Meta Layoff: మరో విడత ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమవుతున్న మెటా..
గిరిజన విశ్వవిద్యాలయం స్థాపించాడానికి పదేళ్లా.. పోలవరంకి జాతీయ హోదా ఇచ్చి, కాలేశ్వరం కు ఎందుకు ఇవ్వరు సవితి తల్లి ప్రేమ ఎందుకు… అని ఆయన అన్నారు. తెలంగాణలో బీజేపి అవసరమా, బీజేపి ని తరిమికొట్టాలన్నారు కడియం శ్రీహరి. తెలంగాణ బీజేపి నాయకులు దద్దమ్మలు చీము నెత్తురు ఉంటే ప్రశ్నించాలన్నారు. మోడీ హోదా మరచి దిగజారి మాట్లాడారు, నీచ రాజకీయాల కోసం బఫూన్ లాగా జోకర్ లాగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. దళిత మైనారిటీ వ్యతిరేక విధానం అవలంభించిన బీజేపి తెలంగాణలో అవసరమా… తెలంగాణకు సీఎం కేసీఆరే శ్రీరామరక్ష…. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సీఎం కేసీఆర్ కి అండగా ఉండి గెలిపించి తెలంగాణ అభివృద్ధి పాలుపంచుకోవాలన్నారు.
Also Read : Ram Charan: ధోనిని కలిసిన రామ్ చరణ్..వైరల్ అవుతున్న పిక్స్..