అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవంకు సంబంధించి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే నగరమంతా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. కాగా.. జనవరి 22న ప్రాణప్రతిష్ఠా కార్యక్రమంలో ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు రామమందిర సముదాయంలో హాజరుకానున్నారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనబోమని ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రకటించిన సంగతి తెలిసిందే.. కాగా.. ఆ రోజున తమ తమ కార్యక్రమాల్లో బిజీబిజీగా గడపనున్నట్లు తెలిపారు.
Sharad Pawar: రాజీవ్ గాంధీ దేశ ప్రధానిగా ఉన్న సమయంలోనే అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి కీలకమైన ‘శిలాన్యాస్’ నిర్వహించారని నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ అన్నారు. కర్ణాటకలోని నిపానిలో జరిగిన బహిరంగ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ రామ మందిరం పేరిట రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు.
శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద నాసిన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం జగన్, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం సీఎం జగన్ తో కలిసి భవనాలను పరిశీలించారు. ఐఆర్ఎస్ కు ఎంపికైన అభ్యర్థులతో ప్రధాని మోదీ ముఖాముఖి నిర్వహించారు. ఐఆర్ఎస్ అభ్యర్థుల శిక్షణ కోసం రూ.1500 కోట్లతో 503 ఎకరాల్లో కేంద్ర ప్రభుత్వం ఈ భవనాల…
జనవరి 22న అయోధ్యలో జరగనున్న ‘ప్రాణ్‌ప్రతిష్ఠ’ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్.. రాజకీయ కార్యక్రమంగా మార్చారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అందుకే ఆ కార్యక్రమంలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తాము అన్ని మతాలతోనూ ఉన్నామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. హిందూ మతానికి సంబంధించిన అత్యంత ప్రముఖులు (శంకరాచార్య) కూడా ఇది రాజకీయ కార్యక్రమం అని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారన్నారు. అందువల్ల.. ప్రధానమంత్రి, ఆర్ఎస్ఎస్ చుట్టూ రూపొందించబడిన ఇలాంటి కార్యక్రమానికి వెళ్లడం తమకు…
శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షిలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. అందులో భాగంగా.. లేపాక్షిలో శ్రీ దుర్గా పాపనాశశ్వర వీరభద్ర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరామ.. జయ రామ అని చప్పట్లు కొడుతూ వేద పండితులతో కలిసి భగవంతునికి భజన చేశారు. అనంతరం.. వేద పండితుల వద్ద ప్రధాని మోదీ ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమం ముగియగానే అక్కడి నుంచి పాల సముద్రం బయలుదేరారు ప్రధాని నరేంద్ర మోదీ.
Rahul Gandhi: రామమందిర ప్రారంభోత్సవాన్ని ఉద్దేశిస్తూ రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్రమోడీపై కీలక వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామమందిర కార్యక్రమం ‘మోడీ ఫంక్షన్’గా అభివర్ణించారు. జనవరి 22న తేదీని బీజేపీ, ఆర్ఎస్ఎస్ పూర్తిగా నరేంద్రమోడీ కార్యక్రమంగా మార్చాయని, ఇడి బీజేపీ/ఆర్ఎస్ఎస్ ఫంక్షన్ అని మండిపడ్డారు. అందుకే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రెసిడెంట్ వెళ్లనని చెప్పారని అన్నారు.
అయోధ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన మతాచారాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. నేడు ప్రయాశ్చిత్త, కర్మకుటి పూజలు జరగనుండగా.. రేపు ఆలయ ప్రాంగణంలోకి విగ్రహం ప్రవేశించనుంది
ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు.. శ్రీసత్యసాయి జిల్లాలో ప్రధాని మోడీ పర్యటన కొనసాగనుంది.. ప్రముఖ పుణ్యక్షేత్రమైన లేపాక్షిని సందర్శించనున్నారు మోడీ.. ఇక, ఈ పర్యటనలో పాలసముద్రంలో ఆసియా ఖండంలోనే ప్రత్యేక గుర్తింపు సాధిస్తూ నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ ఏర్పాటు కానుంది. రూ.541 కోట్ల అంచనాలతో జాతీయ కస్టమ్స్ , పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల అకాడమీ ఏర్పాటు చేయనున్నారు.. 503 ఎకరాల్లో విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో…
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడారు. భారతదేశం-రష్యా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యా్ని మరింత బలోపేతం చేయడానికి భవిష్యత్ కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి ఇద్దరు నాయకులు అంగీకరించారు. ఇరు దేశాల మధ్య ఇటీవల అత్యున్నత స్థాయిలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై ఇరు దేశాధినేతలు సమీక్షించారు.