Lok sabha: మాల్‌ప్రాక్టీస్‌పై కేంద్రం ఉక్కుపాదం.. లోక్‌సభలో బిల్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోటీ పరీక్షల్లో అక్రమాలపై కేంద్రం కొరడా ఝుళిపించింది. అక్రమాలకు పాల్పడినట్లు రుజువైతే కఠిన శిక్షలు పడేలా కొత్త చట్టాన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది.
Also Read
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
నిరుద్యోగుల బలహీనతలను కొందరు ఆసరాగా చేసుకుని మాఫీయాలు రెచ్చిపోతుంటాయి. అక్రమార్గాల్లో విద్యార్థులను తప్పుదోవపట్టిస్తుంటాయి. ఇంకొందరైతే ఒకరి స్థానంలో మరొకరితో పరీక్ష రాయించి గట్టెక్కిస్తుంటారు. ఇలా రకరకాలుగా పోటీ పరీక్షల్లో అక్రమంగా ఉద్యోగాలు సంపాదిస్తుంటారు. అర్హులు కాకుండా అనర్హులు ఉద్యోగాలు సంపాదిస్తుంటారు. ఏళ్ల తరబడి కోచింగ్‌లు తీసుకుంటూ.. ఉద్యోగమే లక్ష్యంగా చదువుకున్న వాళ్లు మాత్రం అన్యాయానికి గురవుతుంటారు. వీటిన్నంటిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర సర్కార్ సరికొత్త నిర్ణయం తీసుకుంది. పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించేలా పార్లమెంట్‌లో బిల్లు తీసుకుంది. ఈ మేరకు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు.
అక్రమార్కులను అడ్డుకునేందుకు వీలుగా పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) బిల్లును లోక్‌సభ (Lok Sabha)లో కేంద్రం ప్రవేశపెట్టింది. నేరం గనుక రుజువైతే గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష, రూ. కోటి వరకు జరిమానా విధించనుంది.
ఈ బిల్లుతో ముఠాలు, మాఫియాపై కేంద్రం ఉక్కుపాదం మోపనుంది. అలాంటి వారితో చేతులు కలిపే ప్రభుత్వ అధికారులను కూడా కఠినంగా శిక్షించనున్నారు. గుజరాత్, బిహార్, రాజస్థాన్, హర్యానా వంటి రాష్ట్రాల్లో ప్రశ్నాపత్రాల లీకేజీల (Malpractices) కారణంగా పలు పోటీ పరీక్షలు వాయిదా పడ్డాయి. దీంతో కేంద్రం ఈ చట్టాన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. యువతకు భరోసా ఇచ్చేందుకే ఈ బిల్లు తీసుకొచ్చామని.. విద్యార్థుల లక్ష్యంగా ఈ బిల్లు తీసుకురాలేదని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేసిన ప్రసంగంలో ఈ బిల్లు గురించి ప్రస్తావించారు. పరీక్షల్లో అవకతవకల విషయంలో యువత ఆందోళన ప్రభుత్వానికి తెలుసని, ఈ సమస్యపై కఠినంగా వ్యవహరించేందుకు ఒక కొత్త చట్టాన్ని రూపొందించాలని నిర్ణయించిందని వెల్లడించారు.
తెలంగాణలో కూడా టీఎస్‌సీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో కూడా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. దీంతో ఆ పరీక్షలన్నీ రద్దు చేయబడ్డాయి. అక్రమాలకు పాల్పడ్డ నిందితులంతా జైల్లో మగ్గుతున్నారు. ఇక రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి సర్కార్ ఏర్పడిన తర్వాత టీఎస్‌పీఎస్‌ను పూర్తిగా ప్రక్షాళన చేశారు.
తాజావార్తలు
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!