Congress: ప్రధాని మోడీ వ్యాఖ్యలకు కాంగ్రెస్ కౌంటర్ ఎటాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ వేదికగా ప్రధాని మోడీ కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కుటుంబ పాలనతో దేశాన్ని కాంగ్రెస్ సర్వనాశనం చేసిందంటూ ప్రధాని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై లోక్‌సభలో ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా విపక్షాలను టార్గెట్‌గా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ మండిపడ్డారు.
పార్లమెంట్‌లో మోడీ చేసిన ప్రసంగాన్ని.. విపక్షాలపై చేసిన విమర్శలను కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ఖండించారు. నెహ్రూ, ఇందిరాగాంధీ చనిపోయి చాలా ఏళ్లు అయినా వారి గురించి ప్రస్తావించడం దురదృష్టకరమన్నారు. గాంధీ కుటుంబంపై ప్రధాని వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్‌ను చూసి మోడీ భయపడినట్లుగా ఉన్నారు.. అందుకే మోడీ ప్రసంగమంతా కాంగ్రెస్ గురించే ఉందన్నారు. సమయం మొత్తం కాంగ్రెస్‌కు అంకితం చేసినందుకు మోడీని మెచ్చుకోవాలన్నారు.
Also Read
కాంగ్రెస్ గురించి మోడీ ఏమన్నారంటే…
పదేళ్లు విపక్షంలో ఉన్నా కాంగ్రెస్ తీరు మారలేదు అన్నారు. కుటుంబ పాలనతో దేశం ఎంత నష్టపోయిందని.. కాంగ్రెస్ నాయకులు కూడా అంతే నష్టపోయారన్నారు. ఆ పార్టీలోని యువనాయకులను కూడా దెబ్బ తీస్తున్నారని.. చాలామంది కాంగ్రెస్‌ను వీడుతున్నా ఆ పార్టీ తీరు మారడం లేదని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ బద్ధకాన్ని చూస్తే జాలేస్తోందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. నత్తనడకలో ఆ పార్టీలో ఎవరూ పోటీ పడలేరని. తాను విఫలమై.. మిగతా విపక్షాలు కూడా పని చేయకుండా కాంగ్రెస్ చేస్తోందని తెలిపారు. తోటి విపక్ష పార్టీలను కూడా ఎదగనీయడం లేదన్నారు. ఇండియా కూటమి కుదుపులకు లోనైందని చెప్పారు. విపక్షాల సంకల్పానికి తాను సలహా ఇస్తున్నా. ఎన్నికలొస్తున్నాయి.. ఇప్పుడైనా కష్టపడండంటూ కాంగ్రెస్‌కు మోడీ చురకలంటించారు.
నెహ్రూ ఇలా అన్నారు..
భారతీయులకు కష్టపడి పనిచేసే అలవాటు లేదని ఎర్రకోట నుంచి నెహ్రూ అప్పట్లో చెప్పారనీ.. యూరప్, జపాన్, చైనా, రష్యా, అమెరికా ప్రజలు కష్టపడినంతగా ఇండియన్లు కష్టపడలేరనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని నరేంద్ర మోడీ గుర్తుచేశారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!