అయోధ్యలో రేపు మహత్తర ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. బాలరాముని ప్రాణప్రతిష్టకు ముహూర్తం సమీపిస్తుంది.. ఈ కార్యక్రమం కోసం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రేపు ఉదయం 10. 20 గంటలకు అయోధ్య ఎయిర్ పోర్ట్ కు చేరుకుని అక్కడి నుంచి 10. 55 నిమిషాలకు రామజన్మభూమి స్థలికి చేరుకుంటారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులోని రామేశ్వరంలో పర్యటించారు. అందులో భాగంగా రామనాథస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ప్రధాని ఇక్కడి అగ్ని తీర్థంలో సముద్ర స్నానమాచరించారు. అంతేకాక ఆలయంలోని తీర్థ బావుల పవిత్ర జలాలనూ ఒంటిపై పోసుకున్నారు. అనంతరం 'శ్రీరామాయణ పారాయణ' కార్యక్రమంలో పాల్గొన్నారు.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తమిళనాడు రాష్ట్రంలో మూడు రోజుల పర్యటన కోసం శుక్రవారం నాడు వెళ్లారు. కాగా, నేడు తిరుచిరాపల్లిలోని శ్రీ రంగనాథ స్వామి ఆయలంలో ఆయన పూజలు చేయబోతున్నారు. ఆ తర్వాత ప్రధాని రామేశ్వరం చేరుకోనున్నారు.
అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉండాలని నిర్ణయించడంతో పార్టీ వైఖరి నచ్చక సీనియర్ ఎమ్మెల్యే సీజే చావ్దా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో సీఎం స్టాలిన్ నడుచుకుంటు వెళ్తున్న సమయంలో కాలు స్లిప్ కావడంతో పక్కనే ఉన్న ప్రధాని మోడీ ఆయన ఎడమ చేతి పట్టుకుని ముందుకు నడిపించాడు.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ బెంగళూర్లో నెలకొల్పుతున్న కొత్త కొత్త బోయింగ్ ఇండియా ఇంజినీరింగ్ & టెక్నాలజీ సెంటర్ (BIETC) క్యాంపస్ ప్రారంభోత్సవంలో శుక్రవారం పాల్గొన్నారు. 43 ఎకరాల స్థలంలో రూ. 1,600 కోట్లతో నిర్మించిన అత్యాధునిక ఫెసిలిటీని ప్రధాని ప్రారంభించారు. ఆ తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించారు.
ఇప్పుడు ఎవరి నోట విన్న అయోధ్య మాటే. అందరి చూపు అయోధ్య వైపు. జనవరి 22న రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట జరగనుంది. ఈ వేడుకను ప్రధాని మోదీ నిర్వహించనున్నారు. అంతేకాకుండా.. ఈ వేడుకలో దేశ, విదేశాల ప్రముఖులు పాల్గొననున్నారు. కాగా.. శ్రీరాముడు పుట్టిన తేదీ క్రీస్తుపూర్వం 5114వ సంవత్సరం, జనవరి 10న మధ్యాహ్నం 12.05 నిమిషాలకు అని ఇనిస్ట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ గణాంకాలతో నిర్ధారించింది. మహాభారతం, రామాయణాలు, పౌరాణిక ఇతిహాసాలు.. కేవలం కల్పిత కావ్యాలు…
జనవరి 22న రామ విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా.. అయోధ్యలో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రాణ ప్రతిష్టకు ఆహ్వానించిన వీవీఐపీల భద్రత కోసం 45 ప్రత్యేక బృందాలు గస్తీ కాస్తోంది. ప్రధాని మోదీ, పలువురు ప్రముఖులు రాక సందర్భంగా ముందే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అయోధ్య చేరుకుంది. ఈ క్రమంలో ఈరోజు సాయంత్రం నుంచి ఆలయంలోకి సామాన్య భక్తులను ఎవరిని అనుమతించరు. ప్రాణ ప్రతిష్ట జరిగిన మరుసటి రోజు నుంచి భక్తులకు రాముడి దర్శనం ఉంటుందని…
ప్రధాని మోదీ శుక్రవారం మహారాష్ట్రలోని షోలాపూర్ లో పర్యటించారు. అక్కడ.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అర్బన్ పథకం కింద పేద ప్రజలకు ఆయన చేతుల మీదుగా ఇళ్లను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. దేశంలోనే పీఎం ఆవాస్ యోజన కింద నిర్మించిన అతిపెద్ద సొసైటీని నేడు ప్రారంభించామని తెలిపారు. 2014లో హామీ ఇచ్చానని.. ఆ వాగ్దానం నెరవేరడం, దాన్ని చూడటానికి రావడం.. ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. మరోవైపు.. ఈ ఇళ్లను చూడగానే తనకు బాల్యం గుర్తొచ్చిందని పేర్కొన్నారు. చిన్నతనంలో…