S Jaishankar: న్యూఢిల్లీలో సంప్రదింపులు లేకుండా ప్రస్తుతం ప్రపంచం ఏ సమస్యపై నిర్ణయం తీసుకోలేదని, భారత్ ప్రపంచంలో చాలా కీలకంగా మారిందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. భారత్ మారిందని, ప్రపంచం మనల్ని చూసే దృష్టి కూడా మారిందని ఆయన శనివారం అన్నారు. భారత్ స్వతంత్రంగా ఉండటమే దీనికి కారణమని.. భారత్ వేరొకరి సంస్థలా కాకుండా, తన ప్రయోజనాల కోసం పరస్పరం విభిన్న దేశాలతో కలిసి పనిచేస్తుందని ఆయన అన్నారు.
ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని అమేఠీకి చెందిన శత్రుజ్ఞ బరన్వాల్ అనే వృద్ధుడు.. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేరును ఏకంగా 9 లక్షల 9 వేల సార్లు రాసి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు.
LK Advani: అయోధ్యంలో రామాలయ ప్రారంభోత్సవం ఈ నెల 22న జరగబోతోంది. ఈ కార్యక్రమానికి బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ కూడా ఆహ్వానించారు. 1990 సెప్టెంబర్ 25న గుజరాత్ సోమనాథ్ నుంచి ప్రారంభమైన రథయాత్ర డిసెంబర్ 6, 1992న అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చేవరకు అద్వానీ రథయాత్ర సాగింది. ఒక విధంగా చెప్పాలంటే రామాలయ నిర్మాణంలో అద్వానీది ప్రముఖమైన పాత్ర. ఆయన రథయాత్రతోనే రామమందిర నిర్మాణం అనేది జనాల్లో నాటుకుపోయింది. అద్వానీతో పాటు మరో సీనియర్ బీజేపీ…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాసిక్ కాలారామ్ మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాని మాట్లాడుతూ.. ఇవాళ నాసికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.. అయోధ్య ప్రాణ ప్రతిష్ట వేళ నాసిక్ లో ప్రత్యేక కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు.
భారత్తో వివాదం ముదిరిన తర్వాత మాల్దీవులకు వచ్చే పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గింది. భారత్ లోనే వందలాది మంది తమ పర్యటనలను క్యాన్సిల్ చేసుకున్నారు. దీంతో పాటు మేక్ మై ట్రిప్, ఈజ్ మై ట్రిప్ మాల్దీవుల బుకింగ్లను రద్దు చేశాయి.
రష్యా నుంచి భీకర దాడులను ఎదుర్కొంటున్న ఉక్రెయిన్.. సాయం కోసం భారత్కు విజ్ఞప్తి చేసింది. రష్యా దాడుల కారణంగా దేశం సర్వనాశనమైందని తెలిపింది. దేశ ఆర్థిక వ్యవస్థ నాశనమైందని ఉక్రెయిన్ పేర్కొంది. ప్రపంచ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు వీలుగా పునర్నిర్మాణంలో ఉక్రెయిన్ ఇప్పుడు భారతదేశం నుంచి సహాయం కోరింది.
ఉత్తరప్రదేశ్ కనెక్టివిటీ కోసం కొత్తగా ఐదు ఎయిర్ పోర్టులను ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రకటించారు. దీంతో రాష్ట్రంలోని మొత్తం విమానాశ్రయాల సంఖ్య 19కి చేరుకుందని పేర్కొన్నారు.
నరేంద్ర మోడీ ప్రభుత్వంలో చాలా వేగంగా రైల్వే అభివృద్ధి చెందింది.. స్విట్జర్లాండ్ తో సమానంగా నెట్వర్క్ అభివృద్ధి చేశాం.. 2004లో కాంగ్రెస్ హయాంలో రైల్వే బడ్జెట్ రూ.8000 కోట్ల నుంచి రూ. 29 వేల కోట్లకు పెరిగింది.. మోడీ ప్రభుత్వంలో బడ్జెట్ రూ.2.8 లక్షల కోట్ల చేరిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి