ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం గోవాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా.. ‘ఇండియా ఎనర్జీ వీక్ 2024’ను ప్రారంభించనున్నారు. అంతేకాకుండా.. రూ. 1,350 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. దాంతో పాటు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) క్యాంపస్‌ను జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం డెవలప్‌డ్ ఇండియా, డెవలప్‌డ్ గోవా 2047 కార్యక్రమంలో మోడీ ప్రసంగించనున్నారు.
PM Modi: హ్యాట్రిక్ విజయం ఖాయం.. లోక్ సభలో ప్రధాని మోడీ..
ప్రధానమంత్రి కార్యాలయం (PMO) విడుదల చేసిన వివరాల ప్రకారం.. దక్షిణ గోవాలోని బేతుల్ గ్రామంలో ఉదయం 10.30 గంటలకు ONGC సీ సర్వైవల్ సెంటర్‌ను ప్రధాని ప్రారంభించి, ఇండియా ఎనర్జీ వీక్‌ను ప్రారంభిస్తారని పేర్కొంది. ఎనర్జీ వీక్ అనేది భారతదేశం యొక్క అతిపెద్ద ఏకైక ఓమ్నిచానెల్ ఎనర్జీ ఎగ్జిబిషన్. దీని ప్రారంభోత్సవానికి వివిధ దేశాల నుండి దాదాపు 17 మంది ఇంధన మంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో 900 మందికి పైగా ఎగ్జిబిటర్లు పాల్గొంటారు. ఇది కెనడా, జర్మనీ, నెదర్లాండ్స్, రష్యా, బ్రిటన్, అమెరికా అనే ఆరు దేశాల నుండి పెవిలియన్లను కలిగి ఉంటుంది.
Bad Cholesterol : చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించే చిట్కా.. మన ఇంట్లోనే..!