PM Modi: ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు గుజరాత్ రాష్ట్రంలో పర్యటించారు. శ్రీకృష్ణుడు నడయాడిన నేలగా ప్రసిద్ధి చెందిన ద్వారక ప్రస్తుతం అరేబియా సముద్రంలో మునిగిందని భావిస్తుంటారు. పీఎం మోడీ అరేబియా సముద్ర నీటి అడుగున ద్వారకాధీశుడికి పూజలు నిర్వహించారు. శతాబ్ధాల క్రితం శ్రీకృష్ణుడు పాలించిన ద్వారకా సముద్ర అడుగు భాగంలో ఉందని హిందువులలు నమ్ముతారు. బెట్ ద్వారకా ద్వీపం సమీపంలో స్కూబా డైవింగ్ నిర్వహిస్తారు. ఈ ప్రాంతంలో పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొన్న పురాతన ద్వారక నగరం…
BJP: లోక్‌సభ ఎన్నికలకు మరెంతో కాలం లేదు. మూడోసారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో బీజేపీ ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆ పార్టీ వ్యూహాలకు పదును పెట్టింది. ఇటీవల ఢిల్లీ వేదికగా నేతలతో జాతీయ సమావేశం నిర్వహించింది. లోక్‌సభ ఎన్నికల కోసం వ్యూహాలను, ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఇదిలా ఉంటే వచ్చే నెలలో కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో బీజేపీ వచ్చే గురువారం 100 మంది అభ్యర్థులతో…
PM Modi: కాంగ్రెస్ పార్టీపై మరోసారి ప్రధాని నరేంద్రమోడీ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ బంధుప్రీతి, అవినీతి, బుజ్జగింపులకు మించి ఆలోచించదని, దేశాభివృద్ధి వారి ఎజెండాలో ఎప్పుడూ లేని పీఎం దుయ్యట్టారు. స్వాతంత్ర్యం అనంతరం కాంగ్రెస్ దేశాన్ని చాలా ఏళ్లు పాలించిందని, అయితే వారి దృష్టి కేవలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపైనే ఉందని, దేశ భవిష్యత్తుపై లేదన్నారు. శనివారం ‘విక్షిత్ భారత్ విక్షిత్ ఛత్తీస్‌గఢ్’ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా ఏపీకి కేటాయించిన ఎయిమ్స్ ప్రారంభానికి సిద్ధమైంది. ఈ ఆధునిక వైద్య దేవాలయాన్ని రేపు ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. మంగళగిరి ఎయిమ్స్‌ను ప్రధాని మోడీ జాతికి అంకితం చేయనున్నారు. అలాగే 9 క్రిటికల్ కేర్ యూనిట్లకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో నిర్మితమైన ఎన్టీపీసీకి చెందిన 1,600 మెగావాట్ల లారా సూపర్ థర్మల్ పవర్ స్టేషన్‌ను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవాళ (శనివారం) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతికి అంకితం చేస్తారు.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ తన వారణాసి పర్యటనలో పరోక్షంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. వారణాసి ప్రజలు ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్ని ఆయన తప్పుబట్టారు. ఉత్తర ప్రదేశ్ ప్రజల్ని అవమానించినందుకు ప్రధాని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారణాసిలో మద్యం సేవించి రోడ్డుపై పడి ఉన్నవారిని తాను చూశానని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ శుక్రవారం మండిపడ్డారు.
PM Modi: గూగుల్ ఏఐ టూల్ జెమిని, ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశిస్తూ అనుచిత సమాధానం ఇవ్వడంపై కేంద్రం సీరియస్ అయింది. ఐటీ నియమాలను, క్రిమినల్ కోడ్‌ని ఉల్లంఘించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కేంద్ర ఐటీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. గుగూల్కి వ్యతిరేకం చర్యలు ఉంటాయని అన్నారు. మోడీపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా జెమనీ పక్షపాతంతో కూడిన సమాధానం చెప్పినట్లు ఓ జర్నలిస్టు సమస్య తీవ్రతను లేవనెత్తారు.
Kishan Reddy: రామగుండంలో ఎరువుల పరిశ్రమను మోడి ప్రారంభించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాగజ్ నగర్ లో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఎన్నికల కార్యాచరణను మొదలు పెట్టిందన్నారు.