బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తుపై ఆయా పార్టీల అధినేతలు జేపీ నడ్డా, చంద్రబాబు, పవన్ కల్యాణ్ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. మోడీ, బీజేపీ, టీడీపీ, జనసేన దేశ ప్రగతికి, ఏపీ ప్రజల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నాయన్నారు. ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారని తెలిపారు.
ప్రధాని మోడీ గత 10 సంవత్సరాలుగా దేశాభివృద్ధి ప్రగతి కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్నారన్నారు. బీజేపీతో టీడీపీ-జనసేన కలిసి రావడం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలను చేరుకోవడానికి సహాయం చేస్తుందని తెలిపారు. బీజేపీ-టీడీపీల మధ్య పాత సంబంధాలున్నాయని.. 1996లో టీడీపీ ఎన్డీయేలో చేరిందని, అటల్ జీ, నరేంద్ర మోడీ ప్రభుత్వంలో కలిసి విజయవంతంగా పనిచేచేశారని పేర్కొన్నారు.
2014లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీడీపీ-బీజేపీ కలిసి పోటీ చేసిందని పేర్కొ్న్నారు. 2014 సాధారణ అసెంబ్లీ ఎన్నికలకు జనసేన మద్దతు ఇచ్చిందని తెలిపారు. సీట్ల పంపకానికి సంబంధించిన విధివిధానాలను ఒకటి రెండు రోజుల్లో చర్చించనున్నామని చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజల నిరీక్షణకు తగ్గట్టుగానే, వారి హృదయపూర్వకమైన ప్రజల మద్దతుతో కూటమి ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నామని తెలిపారు. పెద్ద మొత్తంలో ప్రజల హృదయపూర్వక మద్దతు లభిస్తుందని చెప్పారు.

Gudivada Amarnath: కేఏ పాల్ తప్ప అందరితోనూ పొత్తులు పెట్టుకున్న చరిత్ర ఆయనది..
మరోవైపు.. టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తుపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్వీట్ చేశారు. ఎన్డీఏ కూటమిలో చేరాలన్న చంద్రబాబు, పవన్ నిర్ణయాన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నానని చెప్పారు. మోడీ నాయకత్వంలో టీడీపీ, తెలుగుదేశం, జనసేన దేశ ప్రగతికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నాయని ట్వీట్ లో తెలిపారు.