ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 1134 కీలో మీటర్లు నేషనల్ హైవేలను 29,395 కోట్ల రూపాయలతో నిర్మించగా.. వాటిని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో శంకుస్థాపన రోడ్లు వేయడం వల్లన అర్ధిక అభివృద్ధికి ఎంతో దోహద పడుతుంది అని పేర్కొన్నారు. ప్రధానమంత్రి అభివృద్ధి చెందిన దేశంగా చూడాలన్నది ఆయన కల అని చెప్పుకొచ్చారు. నరేంద్ర మోడీ ప్రధాని స్థానంలో రాక ముందు ప్రపంచంలోనే భారత్ అభివృద్ధిలో 11స్ధానంలో ఉండేది అని పురంధేశ్వరి వెల్లడించింది.
Read Also: CM Yogi Adityanath: సీఎం యోగి ఆదిత్యనాథ్ డీప్‌ఫేక్ వీడియో.. ఎఫ్ఐఆర్ నమోదు!
అయితే, ఇప్పుడు భారతదేశం ఐదవ స్ధానంలో ఉంది అని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొనింది. దేశ ప్రజలను అందరిని ప్రగతి పథంలో నడిపిస్తూ.. భారత దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు అని చెప్పుకొచ్చారు. రోడ్లు మార్గం, రైలు మార్గం, విమాన మార్గాలు అభివృద్ధి జరిగితే.. దేశం ఆభివృద్ధి జరుగుతుంది.. 2014 ముందుగా రోడ్లు రోజుకు 13 కిలో మీటర్ల వేశా వారు.. ఇప్పుడు రోడ్లు వేయడంలో వేగం పెరిగింది.. దేశ అభివృద్ధి అనేది నరేంద్ర మోడీతో సాథ్యం అని ఆమె తెలిపింది.
ఇక, బీజేపీ ఎంపీ, సీఎం రమేష్ మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ అంటేనే అభివృద్ధి అని చెప్పుకొచ్చారు. ప్రయాణం సేఫ్ గా ఉండాలంటే రోడ్లు బాగుండాలి.. హవాయ్ చెప్పులు వేసుకునే వారు కూడా హవాయ్ లో ప్రయాణించాలన్నది మోడీ ఆలోచన అని ఆయన తెలిపారు.