ఢిల్లీ-గురుగ్రామ్ మార్గంలో ట్రాఫిక్‌ను సులభతరం చేసే ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేను (Dwarka Expressway) ప్రధాని మోడీ (PM Modi) ప్రారంభించారు. ఈ ఎక్స్‌ప్రెస్ ద్వారా ఢిల్లీ-గురుగ్రామ్ ప్రయాణం ఇకపై సులభతరం కానుంది.
ఈ ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేను స్తంభాలపై నిర్మించారు. మొత్తం 18 కి.మీల పొడవునా ఉన్న ఈ మార్గంలో అనేక అండర్‌పాస్‌లు, సర్వీస్ రోడ్లు ఉన్నాయి. మొత్తం ఎనిమిది లైన్లతో ఈ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించారు. ఈ రూటు ఐజీఐ విమానాశ్రయం, గురుగ్రామ్ బైపాస్‌లను కనెక్టివిటీ చేయనుంది.
భారతదేశంలోనే మొదటిది..
భారతదేశంలోనే మొట్ట మొదటి 8 లైన్ల ఎక్స్‌ప్రెస్‌వే కావడం దీనికే సొంతం. అత్యాధునిక మౌలిక సదుపాయాలతో దీన్ని నిర్మించారు. ఢిల్లీ-హర్యానా సరిహద్దు నుంచి బసాయి రైల్వే ఓవర్‌బ్రిడ్జ్ (ROB) వరకు 10.2 కిలోమీటర్ల దూరం. మరియు బసాయి ROB నుంచి ఖేర్కి దౌలా క్లోవర్‌లీఫ్ ఇంటర్‌ఛేంజ్ వరకు 8.7 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది.
ముఖ్యాంశాలు ఇవే..
1. భారతదేశంలోనే ప్రీమియర్ ఎలివేటెడ్ అర్బన్ ఎక్స్‌ప్రెస్ వే కావడం విశేషం. ఎనిమిది లేన్‌లతో సింగిల్ పిల్లర్ ఫ్లైఓవర్‌ను కలిగి ఉంది. దీన్ని సుమారు రూ. 9 వేల కోట్లతో నిర్మించారు.
2. హర్యానాలో 19 కిలోమీటర్లు.. ఢిల్లీలో 10 కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఈ ఎక్స్‌ప్రెస్‌వే ఢిల్లీ-గురుగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌వేలో శివ్-మూర్తి నుంచి ప్రారంభమై ఖేర్కి దౌలా టోల్ ప్లాజా దగ్గర ముగుస్తుంది.
3. టన్నెల్‌లు మరియు అండర్‌పాస్‌లు, అట్-గ్రేడ్ రోడ్ సెక్షన్, ఎలివేటెడ్ ఫ్లైఓవర్ మరియు ఫ్లైఓవర్ కాన్ఫిగరేషన్‌పైన ఉన్న ఫ్లైఓవర్‌తో సహా నాలుగు బహుళ-స్థాయి ఇంటర్‌ఛేంజ్‌లను కలిగి ఉంది.
4. ఒకే పిల్లర్‌పై ఎనిమిది లేన్లలో 9-కిలోమీటర్ల పొడవు.. 34 మీటర్ల వెడల్పు గల ఎలివేటెడ్ రహదారి ద్వారా ప్రత్యేకించబడింది,. ఇది దేశంలోనే మొట్టమొదటి ఇంజనీరింగ్ అద్భుతం.
5. ద్వారకా సెక్టార్ 25లో రాబోయే ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (IICC)కి నేరుగా యాక్సెస్ అందించడం మరియు లోతులేని సొరంగం ద్వారా ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రత్యామ్నాయ మార్గంగా సేవలు అందించబడుతుంది.
6. సమర్థవంతమైన రవాణా వ్యవస్థ (ITS)తో పాటు అధునాతన భద్రతా యంత్రాంగాలు మరియు పూర్తి ఆటోమేటెడ్ టోల్ సేకరణ వ్యవస్థను కలిగి ఉంటుంది.
7. నిర్మాణం నాలుగు దశలుగా నిర్వహించబడింది. మహిపాల్‌పూర్‌లోని శివమూర్తి నుంచి బిజ్వాసన్ వరకు. బిజ్వాసన్ ROB నుంచి గురుగ్రామ్‌లోని ఢిల్లీ-హర్యానా సరిహద్దు వరకు. ఢిల్లీ-హర్యానా సరిహద్దు నుంచి బసాయి ROB వరకు. బసాయి ROB నుంచి ఖేర్కి దౌలా క్లోవర్‌లీఫ్ ఇంటర్‌చేంజ్ వరకు విస్తరించి ఉంది.
8. మొత్తం ఈ నిర్మాణానికి 2 లక్షల MT ఉక్కు, 20 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు వినియోగించారు.
2019. మార్చి 9వ తేదీన ఆనాటి కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీలు శంకుస్థాపన చేశారు. మొత్తానికి ఐదేళ్ల తర్వాత ఈఅర్బన్ రహదారి అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా చాలా సమయం ఆదా అవుతుంది. ఈ కార్యక్రమంలో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, కేంద్ర మంత్రి గడ్కరీ పాల్గొన్నారు.