రైతులకు గుడ్ న్యూస్. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 16వ విడత కోసం నిరీక్షణ ఇప్పుడు ముగియనుంది. ఫిబ్రవరి 28న అంటే రేపు కోట్లాది మంది రైతుల ఖాతాలకు 2000 రూపాయలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బదిలీ చేయనున్నారు.
అనంతపురం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో 'న్యాయ సాధన' సభ పేరుతో బహిరంగ సభను నిర్వహించింది. ఈ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ.. అనంతపురం జిల్లా అంటే సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి అమిత ప్రేమ అని అన్నారు. మరోవైపు.. రాష్ట్ర అభివృద్ధి వైఎస్సార్ హాయంలోనే జరిగినట్లు చెప్పారు. అలాంటి.. సుపరిపాలన అందించేందుకు వైఎస్ షర్మిలను మీ ముందుకు తీసుకొచ్చామని ఖర్గే పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడుతుందని, తప్పకుండా…
భారత్ ఇప్పుడు పెద్ద కలల కంటోందని.. కలలను నెరవేర్చడానికి పగలు, రాత్రి పని చేస్తోందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం సుమారు రూ.41,000 కోట్ల విలువైన 2,000 కంటే ఎక్కువ రైలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించారు.
Begumpet: బేగంపేట్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ.. ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ వర్చువల్ గా ప్రారంభించనున్నారు.
భారతదేశంలో పేదరిక నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పలు కార్యక్రమాలు సక్సెస్ అయ్యాయని నీతి అయోగ్ తెలిపింది. అది జరిపిన తాజా సర్వేలో భారత్‌లో దాదాపు 5 శాతం మేర పేదరికం తగ్గిందని నీతి అయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రమణ్యం పేర్కొన్నారు.
PM Modi: రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. తెలంగాణలో కొత్తగా 15 అమృత్ భారత్ స్టేషన్లను నిర్మించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ వెల్లడించారు.
West Bengal: పశ్చిమ బెంగాల్ రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో సందేశ్‌ఖలీ ప్రాంతంలో మహిళలు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేతలకు వ్యతిరేకంగా తిరగబడుతున్నారు. గత రెండు వారాలుగా ఈ ప్రాంతం నిరసనలతో అట్టుడుకుతోంది. మహిళల ఆందోళనలకు బీజేపీ మద్దతు ఇచ్చింది. సందేశ్‌ఖలి ఘటన లోక్‌సభ ఎన్నికల ముందు మమతా బెనర్జీకి తీవ్ర ఇబ్బందిగా మారింది.
మంగళగిరి ఎయిమ్స్‌ను పేదల కోసం ఉపయోగపడేలా ప్రధాని మోడీ ఏర్పాటు చేశారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. తెలుసుకోవాలని లేనివాళ్ళు ఎప్పటికీ తెలుసుకోలేరు... మోదీ ప్రభుత్వం చేసిన మార్పులను అని ఆయన వ్యాఖ్యానించారు.
ఎన్నికల వేళ ఏపీపై ఫోకస్ పెట్టారు ప్రధాని మోడీ. మంగళగిరితో పాటు దేశంలోని 5 అఖిల భారత వైద్య విద్యా సంస్థలను ప్రారంభించి వాటిని జాతికి అంకితం చేశారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్ నుంచి వర్చువల్‌గా ఈ ప్రారంభోత్సవం జరిగింది. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా మంగళగిరికి ఈ ఎయిమ్స్ వచ్చింది. మంగళగిరి ఎయిమ్స్‌ను ప్రధాని మోడీ ఆదివారం రాజ్‌కోట్ నుంచి వర్చువల్‌గా జాతికి అంకితం చేశారు.