రాజకీయ లబ్ధి పొందటం కుదరదు.. రేషన్ బియ్యం కేసులో సూత్రధారి పేర్ని నాని.. ఈ కేసు నుంచి తప్పించుకోలేడని మంత్రి రవీంద్ర పేర్కొన్నారు. గోడౌన్ ప్రారంభం చేసింది పేర్ని భార్య కాదన్నారు.. ఆడవాళ్ళ గౌరవాల గురించి ఇప్పుడు పేర్ని నాని చెప్పటం విడ్డూరంగా ఉంది.. నారా భువనేశ్వరి గురించి సభలో మాట్లాడినపుడు నీ గుణం ఏమైంది నువ్వు ఎక్కడ సచ్చావ్ అంటూ మండిపడ్డారు.
Ration Rice Case: మాజీ మంత్రి పేర్ని నాని భార్య గోడౌన్ లో రేషన్ బియ్యం మాయం కేసులో కీలక పురోగతి లభించింది. ఈ కేసులో ఏ2గా ఉన్న మానస తేజను మచిలీపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Jc Prabhakar Reddy: వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా మహిళల గురించి మాట్లాడే అర్హత నానికి లేదని తెలిపారు. గతంలో చేసినవి అన్ని మార్చిపోయారా.. జేసీ కుటుంబం మీద కేసులు పెట్టినప్పుడు కుటుంబం కనబడలేదు.. అసలు విక్టోరియా ఎవరూ.. అర్థరాత్రి సమయంలో చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు కుటుంబం కనపించలేదా అని మండిపడ్డారు.
Perni Nani: డిసెంబర్ 10వ తేదీ నుంచి నా భార్య జయసుధ పేరు మీద మచిలీపట్నంలో ఉన్న గోడౌన్ ఆఫర్ లెటర్ ఇచ్చి అద్దెకు తీసుకున్నారని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. అక్రమార్కుడిగా నేనేదో ఉద్దేశ్య పూర్వకంగా తప్పుడు పనులు చేసానని అత్యుత్సాహంతో ఆరోపణలు చేశారని మండిపడ్డారు.
తెలంగాణలో నేడు విద్యాసంస్థలకు సెలవు. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు స్కూళ్లకు సెలవు. వారం రోజులు సంతాప దినాలు పాటించాలని ఉత్తర్వులు. మాజీ ప్రధాని మన్మోహన్ నివాసంలో పార్ధివదేహం. మన్మోహన్ పార్థివదేహానికి నివళులర్పించిన నేతలు. రేపు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు. ఢిల్లీ: ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం. నేడు ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు రద్దు. వారం రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన కేంద్రం. మన్మోహన్‌సింగ్‌కు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయం. విద్యుత్ ఛార్జీల…
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని గోదాముల్లో రేషన్ బియ్యం మిస్సింగ్ కేసుపై మంత్రి కొల్లు రవీంద్ర సీరియస్ అయ్యారు. ఈ కేసులో పేర్ని నానికి సహకరిస్తున్నారని ఆరోపణలు ఉన్న అధికారులకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. విచారణలో భాగంగా అధికారుల పాత్ర ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు. రేషన్ బియ్యం కుంభకోణంపై సిట్ ఏర్పాటుకు సిఫార్సు చేస్తానన్నారు. తప్పు చేసి డబ్బులు కడితే పేర్ని నాని దొర అవుతాడా? అని మంత్రి ప్రశ్నించారు. పదేపదే నీతి వ్యాఖ్యలు…
అన్నమయ్య జిల్లాలో కాల్పుల కలకలం నాటు తుపాకీ మోత ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఎవరితో విభేదాలు లేవంటున్న ఆ కుటుంబం పై ఇక కాల్పులు జరిపింది ఎవరు? ఇదే వెయ్యి డాలర్ల ప్రశ్నగా మిగిలింది. పొద్దు పొద్దున్నే సంచలనం సృష్టించిన మిస్టరీగా రాయచోటి కాల్పులు ఘటన ఘటనలు ఇద్దరు గాయపడ్డారు… అయితే వారిద్దరూ చిక్కు వెంట్రుకలు అమ్ముకుంటూ జీవనం సాగించేవారు. చిక్కు వెంట్రుకలు సేకరిం చే వారిపై కాల్పులు జరపాల్సిన అవసరం ఎవరిది? ఎందుకు…
Perni Nani : ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ బియ్యం అక్రమాల కేసు దర్యాప్తులో భాగంగా వైఎస్సార్‌సీపీ నేత , మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. పేర్ని నానికు చెందిన గోడౌన్‌లో రేషన్ బియ్యం అక్రమాలు నడుస్తున్నట్లు పోలీసులు గుర్తించిన తర్వాత ఈ కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు. పోలీసులు, తమ దర్యాప్తులో సహకరించాలని కోరుతూ, పేర్ని నాని ఇంటికి వెళ్లారు. కానీ ఇంట్లో ఎవ్వరూ లేకపోవటంతో, ఇంటి…
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని దోంగతనం చేసి డబ్బులు కట్టినంత మాత్రాన కేసు ఉండకుండా ఉండదని టీడీపీ నేత, ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు అన్నారు. బియ్యం దొంగతనం జరిగిందని పేర్ని నాని ఒప్పుకున్నారని, మాయమైన బియ్యానికి ఆయన సమాధానం చెప్పాలన్నారు. పేర్ని నాని కుటుంబ సభ్యులను కూటమి నేతలు దాచారనే ప్రచారం సరికాదని, పేర్ని నానిని దాయాల్సిన అవసరం తమకు లేదని నారాయణరావు పేర్కొన్నారు. ‘పేర్ని నాని దోంగతనం చేసి డబ్బులు…
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబ సభ్యులపై లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. రేషన్ బియ్యం గోదాముల్లో తగ్గటంపై కేసు నమోదు నేపథ్యంలో అధికారులు లుక్ అవుట్ నోటీస్ జారీ చేశారు. వారం రోజులుగా పేర్ని నాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. అందుకే వారిపై పోలీసులు లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు. పేర్ని నాని సోమవారం సాయంత్రం అజ్ఞాతం నుంచి బయటకొచ్చారు. పేర్ని నాని సతీమణి జయసుధ ఇంకా అజ్ఞాతం వీడలేదు.…