Kollu Ravindra: పేర్ని నాని ఒక బియ్యం దొంగ అని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. 7500 బస్తాల బియ్యం పందికొక్కు మాదిరి తిన్నాడు.. మళ్ళీ వచ్చి నీతి కబుర్లు చెబుతున్నాడు.. అభూత కల్పనతో డ్రామాలు ఆడుతున్నాడు.. పేదలకు పంచాల్సిన బియ్యం సొంత గోదాము నుంచి తరలించి డబ్బులు కొట్టేశాడు.. కనీసం భార్య పేరు మీద ఉన్న గుడౌన్ రేపు ఏమన్నా ఇబ్బంది వస్తదని భయం కూడా పడలేదు.. సీఎంకు నేను ఏదో చెబితే సీఎం నన్ను ఏదో అన్నాడని అబద్ధాలు ఆడుతున్న పేర్ని నాని అసలు మనిషి కాదు అని ఆయన అన్నారు. పేర్ని నాని ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి.. భార్యను అడ్డం పెట్టుకొని సింపతీ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.
Read Also: Canadian Plane: రఫ్ ల్యాండింగ్.. తృటిలో ప్రమాదం నుంచి బయటపడిన కెనడా విమానం..
ఇక, రాజకీయ లబ్ధి పొందటం కుదరదు.. రేషన్ బియ్యం కేసులో సూత్రధారి పేర్ని నాని.. ఈ కేసు నుంచి తప్పించుకోలేడని మంత్రి రవీంద్ర పేర్కొన్నారు. గోడౌన్ ప్రారంభం చేసింది పేర్ని భార్య కాదన్నారు.. ఆడవాళ్ళ గౌరవాల గురించి ఇప్పుడు పేర్ని నాని చెప్పటం విడ్డూరంగా ఉంది.. నారా భువనేశ్వరి గురించి సభలో మాట్లాడినపుడు నీ గుణం ఏమైంది నువ్వు ఎక్కడ సచ్చావ్ అంటూ మండిపడ్డారు. పేర్ని నాని పాపం పండటంతో గజగజ వణుకుతున్నాడని ఎద్దేవా చేశారు. నాకు నా మేనేజర్ కు సంబంధం లేదని అబద్ధాలు చెప్పి అతనిపై నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.. అక్రమంగా తన పేరు పెట్టాడని నాని గగ్గోలు పెడుతున్నాడు.. మేం ఏం చేయకుండానే ఖర్మ పేర్ని నానినీ వెంతాడుతుంది అని కొల్లు రవీంద్ర చెప్పుకొచ్చారు.
Read Also: Ration Rice Case: పేర్ని నాని భార్య గోడౌన్లో రేషన్ బియ్యం మాయం కేసులో కీలక పురోగతి..
అయితే, చనిపోయిన తల్లిపై పేర్ని నాని ప్రమాణం చేస్తున్నాడని మంత్రి రవీంద్ర ఎద్దేవా చేశారు. గతంలో కూడా పోటీ చేయను అని ప్రమాణాలు చేశాడు అవన్నీ ఏమయ్యాయి.. పేర్ని నానికి నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాడు.. తప్పు చేయనపుడు గోడౌన్ తాళాలు ఎందుకు తీయలేదు అని ఆయన మండిపడ్డారు. 7 వేల బస్తాలు కొట్టేసి డబ్బులు కడితే నువ్వు తప్పు చేయనట్టా?.. తప్పు చేసిన వారు ఎవరైనా శిక్ష తప్పదన్నారు. కక్ష సాధింపు చేస్తే 6 నెలలు బందరులో తిరగవు.. నా మీద అక్రమ కేసులు పెట్టించావు.. నీకు ఇక నిద్ర లేని రాత్రులే.. చంద్రబాబు నన్ను కేకలు వేశాడని నీచంగా అబద్ధాలు చెబుతున్నాడని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.