Perni Nani : కూటమి ప్రభుత్వంపై మరోసారి వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తప్పుడు రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు గతంలో ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను మంత్రులుగా ప్రమాణం చేయించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన అన్నారు. మనుషులను ప్రలోభాలకు గురి చేయడంలో చంద్రబాబుకు సరితూగే వ్యక్తి లేరని విమర్శించారు. కొనుగోలుదారులను సిద్ధం చేసి, బయానాలు…
Perni Nani: ఏపీలో మద్యం అమ్మకాల్లో క్యూఆర్ కోడ్ తామే ప్రవేశపెట్టమన్నట్లుగా సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఇది తామే కనిపెట్టినట్లుగా చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని.. అన్నీ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లు పెట్టి చెప్తుంటే సారా మంత్రి ఏమి చేస్తున్నారని విమర్శించారు.. జగన్ ప్రభుత్వ హయాంలో మద్యం బాటిల్ ఫ్యాక్టరీ నుంచి బయటకు వచ్చే ముందే క్యూఆర్ కోడ్ తోనే వచ్చేదని.. ఇప్పుడు అదేదో ఘన కార్యంలా చెప్పుకుంటున్నారన్నారు.. మీరు రాగానే…
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై చిలకలపూడి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. మచిలీపట్నం ఆర్‌ఆర్ పేట పీఎస్‌లో సీఐ ఏసుబాసుపై బెదిరింపులకు దిగారని ఆయనపై కేసు నమోదైంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ పేర్ని నానితో పాటు 29 మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయంలో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడును పేర్ని నాని కలిసి వివరణ ఇచ్చారు. సీఐ తనను రెచ్చగొట్టాడని, తాను కూల్‌గానే మాట్లాడానని తెలిపారు.…
కల్తీ మద్యం కేసులో ఎంతటి వారైనా వదిలేది లేదు అని మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్ ఇచ్చారు. మచిలీపట్నంలో గతంలో ప్రజాప్రతినిధులా, ఇప్పుడు వారే రౌడీలా వ్యవహరిస్తున్నారు అని మండిపడ్డారు. పోలీసు స్టేషన్‌లో అంత రాద్ధాంతం చేయాల్సిన పనేముంది?.. ప్రతీదీ కౌంట్ అవుతుంది, చట్టాలున్నాయి అని మాజీ మంత్రి పేర్ని నానిని ఉద్దేశించి అన్నారు. కొందరు ఇష్టం వచ్చినట్టు తన మీద మాట్లాడుతున్నారని.. తన వాళ్లని నేను కంట్రోల్ చేస్తున్నా అని, వదిలితే తమ వాళ్లు చాలా…
Perni Nani: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి షాకిచ్చారు పోలీసులు.. ఆర్.పేట సీఐ ఏసుబాబుపై దౌర్జన్యం చేశారంటూ చిలకలపూడి పోలీసు స్టేషన్‌లో పేర్ని నానిపై కేసు నమోదు చేశారు.. అయితే, వైసీపీ నేత సుబ్బన్నను నిన్న (శుక్రవారం) విచారణకు పిలిచారు మచిలీపట్నం టౌన్ పోలీసులు.. ఈక్రమంలో ఆ పీఎస్‌కు వెళ్లిన పేర్ని నాని.. సీఐపై సీరియస్ అయ్యారు.. ఓ దశలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.. ఈ ఘటనను…
మాజీ మంత్రి పేర్ని నానిపై కృష్ణాజిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సీరియస్ అయ్యారు. ఆర్ పేట సీఐపై పేర్ని నాని వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ విధులకు ఆటంకం కలిగించేలా వ్యవహరించిన పేర్ని నానిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ‘ఇటీవల మెడికల్ కాలేజ్ వద్ద జరిగిన నిరసన కేసులో కొంత మందికి నోటీసులు ఇచ్చి విచారిస్తున్నాం. అందులో భాగంగా A8గా ఉన్న మేకల సుబ్బన్న అనే వ్యక్తిని స్టేషన్‌కు పిలిపించి విచారిస్తున్నాం. సుబ్బన్నను…
కృష్ణా జిల్లా మచిలీపట్నం వైసీపీ నగర అధ్యక్షుడు మేకల సుబ్బన్న అక్రమ అరెస్టుపై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. సుబ్బన్న అక్రమ అరెస్టుపై మచిలీపట్నం పోలీసులను నిలదీశారు. మచిలీపట్నంలో ఛలో మెడికల్ కాలేజ్ నిరసన చేపట్టినందుకు వైసీపీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. పోలీసులు వైసీపీ నేతల ఇళ్లకు వెళ్లి బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేకల సుబ్బన్నను మాట్లాడాలని స్టేషన్‌కు పిలిపించి అరెస్ట్ చేశారని, ఇంట్లో పెళ్లి ఉందని చెప్పినా…
స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆహ్వానం మేరకు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ నర్సీపట్నం వెళ్తున్నారు అని.. పోలీసులు ఇప్పుడు అనుమతి లేదు అంటే స్పీకర్ అంటే గౌరవం లేదా? అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. స్పీకర్కి మెడికల్ కాలేజీ కనిపించడం లేదని, జగన్ వెళ్లి చూపిస్తారని విమర్శించారు. మెడికల్ కాలేజీకి సంబంధించిన జీవోను, నిర్మాణాలను, పనులు ఆపివేయాలని ప్రభుత్వం ఇచ్చిన జీవో కూడా చూపిస్తామని తెలిపారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ తప్పు…