ఆ వైసీపీ సీనియర్ లీడర్… కూటమి ప్రభుత్వాన్ని బాగా డిస్ట్రబ్ చేస్తున్నారా? ఆ మధ్య కొన్నాళ్ళు కామ్ అయిన నాయకుడు తిరిగి గొంతు సవరించుకోవడాన్ని ప్రభుత్వ పెద్దలు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారా? ఎక్కువ మాట్లాడుతున్నాడు… లోపలేసేయండని అంటున్నారా? ఆయనకు సంబంధించిన లూప్‌హోల్స్ వెదకమని కొందరికి బాధ్యత అప్పగించారా? ఎవరా నాయకుడు? ఏంటా వ్యవహారం? పేర్ని నాని… మాజీ మంత్రి, కృష్ణా జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టిడిపి, జనసేనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ నాయకుల్లో…
గడిచిన 115 రోజులుగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఉద్దేశ్యపూర్వకంగా జైలులో ఉంచారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఎలాగైనా ఆయన్ని ఇబ్బందులు పెట్టాలని కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.. పేర్ని నాని శనివారం మీడియాతో మాట్లాడారు. ఒక కేసులో బెయిలు వస్తుందంటే మరో కొత్త కేసు నమోదు చేస్తున్నారన్నారు.. కేసు మీద కేసు అంటూ తప్పుడు కేసులు పెడుతున్నారని.. వంశీ విషయంలో దేవుడు ఉన్నాడు..
పవన్ కళ్యాణ్ సినిమాకి ఇబ్బంది అవుతుందనుకుని థియేటర్లపై విచారణ చేస్తున్నారు.. సినిమా హాళ్ల వారు మీటింగ్ పెట్టుకుని బంద్ చేస్తామని నిర్ణయం తీసుకుంటే.. ఆ విషయం ప్రభుత్వానికి తెలియదు.. కనీసం ఆ శాఖ మంత్రికి కూడా బంద్ గురించి తెలీదు అన్నారు. ఒక సినిమా ప్రొడ్యూసర్ చెప్పేదాకా ప్రభుత్వానికి ఈ విషయం తెలియదు అని పేర్నినాని సెటైర్లు వేశారు.
జగన్ ప్రభుత్వంలో తక్కువ రేటుకే సినిమాలు చూడాలి అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారని పేర్ని నాని గుర్తు చేశారు.. అప్పుడు ఇదే పవన్ కళ్యాణ్.. నోటికి వచ్చినట్లు మాట్లాడారన్నారు.. సినిమా మాది మా ఇష్టం వచ్చినట్లు అమ్ముకుంటామని గతంలో పవన్ వ్యాఖ్యలను గుర్తు చేశారు. అప్పుడు ఏం మాట్లాడారు.. ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.. పవన్ అధికారంలో ఉంటే ఓ మాట..
పోలీసు వేధింపులకు దేశంలోనే నిలువుటద్దంలా ఏపీ నిలుస్తుందని.. కస్టోడియల్ టార్చర్ కి ఏపీ పోలీస్ స్టేషన్ లు వేదికలుగా మారిపోతున్నాయని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.. గతంలో సోనియాతో కలసి జగన్ ను 16 నెలలు జైలులో ఉంచేందుకు కుట్రలు చేశారని ఆరోపించారు.. లిక్కర్ కేసులో బెయిలుపై బయట తిరుగుతున్న చంద్రబాబు.. లేని లిక్కర్ కేసు సృష్టించారని విమర్శించారు.
చంద్రబాబు నాయకత్వంలో మహానాడు పేరుతో దగానాడు జరగబోతోందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.. కేవలం ఏపీలోని ప్రజలకే కాదు.. జెండా మోసిన కార్యకర్తలకు కూడా దగానాడే అని విమర్శించారు.. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. మహానాడుపై విమర్శలు గుప్పించారు.
Perni Nani: కూటమి ప్రభుత్వానికి బిల్డప్ ఎక్కువ.. బిజినెస్ తక్కువ అని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చారు..
Perni Nani: మచిలీపట్నం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం పాల్గొన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. గుంటూరులో 11 మంది పోలీస్ లను సస్పెండ్ చేయడం చూస్తే కూటమి పాలన అర్థం అవుతోందని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలిసులు ఈ చర్యలు గుర్తించాలని ఆయన అన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో అధికారులను వాడుకొని వదిలేయడం సర్వసాధారణమని.. ఎస్సై, సిఐలు గమనించాలని ఆయన అన్నారు. చంద్రబాబు ఎవరినైనా ఎర వేస్తాడు, ఎవరినైనా బలిచేస్తాడని ఘాటు…
అధికారంలోకి రావటానికి అప్పట్లో ఏమేమి ఎర వేశారో అందరికీ తెలుసు.. కానీ, ఎన్టీఆర్ లా అభిమన్యుడు కాదు జగన్.. అర్జునుడిలా మీ కుట్రలు ఛేదిస్తారని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి పేర్ని నాని.. జైల్లో ఉన్న సమయంలో డ్రామాలు ఆడింది చంద్రబాబు.. జైల్లోకి వెళ్లగానే డీ హైడ్రేషన్.. అలర్జీ అన్నారు..
Perni Nani : తమపై ఎన్ని కక్షపూరిత కేసులు పెట్టినా భయపడేది లేదని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. మంగళవారం మచిలీపట్నంలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో సివిల్ సప్లై శాఖలో ఎన్నడూ లేని విధంగా తమపై క్రిమినల్ కేసులు పెడుతున్నారంటూ వాపోయారు. అసలు చట్టం ప్రకారం ఎవరిపై పెట్టకూడని కేసులు తన కుటుంబంపై పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి వేధింపులు తనకు కొత్తేం కాదని.. కేసులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. ఎన్ని…