తెలంగాణలో నేడు విద్యాసంస్థలకు సెలవు. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు స్కూళ్లకు సెలవు. వారం రోజులు సంతాప దినాలు పాటించాలని ఉత్తర్వులు.
మాజీ ప్రధాని మన్మోహన్ నివాసంలో పార్ధివదేహం. మన్మోహన్ పార్థివదేహానికి నివళులర్పించిన నేతలు. రేపు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు.
ఢిల్లీ: ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం. నేడు ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు రద్దు. వారం రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన కేంద్రం. మన్మోహన్‌సింగ్‌కు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయం.
విద్యుత్ ఛార్జీల పెంపుపై నేడు వైసీపీ నిరసనలు. ఏపీ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన వైసీపీ.
ఫార్మాలా-ఈ కేసులో కొనసాగుతున్న ఏసీబీ దర్యాప్తు. నేడు పలువురు అధికారులను విచారించే అవకాశం. ఇప్పటికే దానకిషోర్ స్టేట్‌మెంట్ రికార్డు.
కృష్ణా: పేర్ని నాని భార్య జయసుధ ముందస్తు బెయిల్‌పై నేడు విచారణ. రేషన్ బియ్యం మాయం కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్. ఈ కేసులో ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడిన విచారణ.
నేడు హైదరాబాద్ నుంచి ఉదయం 10 గంటలకు అమరావతికి చంద్రబాబు. ఉదయం 11 గంటలకు సచివాలయానికి సీఎం చంద్రబాబు.
తెలుగు రాష్ట్రాల్లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.77,740 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రామల బంగారం ధర రూ.71,260 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.1,00,100 లుగా ఉంది.
అమరావతి: నేడు స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్ట్ మీటింగ్. ఇవాళ ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం. ఏపీకి రావాల్సిన పరిశ్రమలు, ఇప్పటికే వచ్చిన కంపెనీల పురోగతిపై చర్చ.
అమరావతి: సజ్జల భార్గవ్‌రెడ్డి క్వాష్ పిటిషన్‌పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ. ఒకే విషయంపై పలు FIRలు నమోదు చేయటాన్ని సవాల్ చేస్తూ సజ్జల భార్గవ్‌రెడ్డి పిటిషన్. సోషల్‌మీడియాలో పోస్టులపై ఇప్పటికే సజ్జల భార్గవ్‌రెడ్డిపై పలు కేసులు నమోదు. కొత్తగా కేసులు నమోదు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ సజ్జల భార్గవ్‌రెడ్డి పిటిషన్.