ప్రతి నియోజకవర్గంలో దాడులకు గురైనవారి ఇళ్లకు వెళ్లి వారికి అండగా నిలుస్తాం అని ప్రకటించారు మాజీ మంత్రి కొడాలి నాని.. కౌంటింగ్ అనంతరం టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు వైసీపీ నేతలపై ఉద్దేశ పూర్వకంగా దాడులు చేస్తున్నారని ఆరోపించిన ఆయన.. ఇళ్లు, కార్లు ద్వంసం చేసి దాడులు చేస్తున్నారు.. వైసీపీ నేతలను, క్యాడర్ ను భయభ్రాంతులకు గురి చేసే విధంగా దాడులు జరుగుతున్నాయన్నారు.
ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక టీడీపీ నేతలు బీహార్ తరహా హింసా రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ నేత పేర్ని నాని తీవ్రంగా మండిపడ్డారు. వైసీపీ నేతలు గురువారం సాయంత్రం గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసి ఈ దాడుల గురించి ఫిర్యాదు చేశారు.
మచిలీపట్నం వైకాపా ఎమ్మెల్యే పేర్ని నాని ఎన్నికల సంఘంపై అర్ధంపర్ధం లేని విమర్శలు చేస్తున్నాడంటూ టీడీపీ పొలిటికల్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. ఈ మేరకు సీఈసీ లేఖ రాశారు.
పోలీసులు అధికారులు బరితెగించి ప్రవర్తిస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఏకపక్షంగా వైసీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని.. అసలు ముద్దాయిలను వదిలేసి తప్పు చేయని వారిపై కేసులు పెడుతున్నారని ఆయన అన్నారు.హింస జరుగుతుందని తెలిసినా పోలీసులు పట్టించుకోలేదని మండిపడ్డారు.
అన్ని వర్గాల వారు సీఎం జగన్కు అండగా ఉన్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. చంద్రబాబు కాపు సామాజిక వర్గంను మోసం చేశారని.. కాపులను బీసీ చేస్తానని చేయలేదని ఆరోపించారు. కాపులకు ఏం చేస్తానో చెప్పి.. చేసి చూపించిన వ్యక్తి వైయస్ జగన్ అని అన్నారు. దళితులను జగన్ కు దూరం చేయాలని చంద్రబాబు ప్రయత్నం చేశారు.. ఆ ప్రయత్నాలు ఫలించలేదని పేర్ని నాని మండిపడ్డారు. బీసీలు కూడా చంద్రబాబు తమను వాడుకుని వదిలేశారని ఆగ్రహం…
టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తాను చేసిన మంచి గురించి చెప్పే దమ్ము లేదని ఆరోపించారు. కొంత మంది మాజీ అధికారులను ప్రభుత్వంపై విషం చిమ్మెలా ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. పీవీ రమేష్ ఐఏఎస్గా పని చేశాడు.. ఇంత దిగజారి ప్రవర్తించాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీవీ రమేష్ తండ్రి సుబ్బారావు మాస్టర్ గారు కొందరు రైతులతో కలిసి ఉమ్మడిగా లీజుకు ఇచ్చారన్నారు. 70 ఎకరాల పొలాన్ని…