ప్రపంచంలోని అగ్ర రాజ్యాల్లో ఒకటిగా చైనా కొనసాగుతోంది. చైనా ఆర్థిక రంగంలో ముందుండుగా... దాంతోపాటు కొత్త కొత్త రోగాలకు సంబంధించిన వైరస్‌లను తీసుకురావడంలోనూ ముందే ఉంటుంది.
నేపాల్ నుంచి టమాటా లోడుతో వస్తున్న వ్యాన్ నిన్న (ఆదివారం) ఉదయం 5 గంటల సమయంలో బీహార్ లోని రాంచీ-పాట్నా హైవే పైన వస్తుండగా డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో చర్హివ్యాలీ దగ్గర వ్యాన్ బోల్తా పడింది. దీంతో వ్యాన్ లోని టమాటాలు రోడ్ పైన పడిపోయాయి.. అది గమనించిన స్థానికులు దొరికిందే అవకాశంగా టమాటాలను ఎవరికీ నచ్చినట్లు వాళ్ళు తీసుకెళ్లారు.
రైల్వే పనులు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాటలు ఎవ్వరూ నమ్మే స్థితిలో లేరు.. బీఆర్ఎస్ ప్రభుత్వం మాట డ్యామెట్ కథ అడ్డం తిరిగింది చందంలా తయారు అయ్యింది అని ఆయన వ్యాఖ్యనించారు.
నాపరాతిని తమకున్న ఆర్డర్ల కోసం వివిధ ప్రాంతాలకు లారీలలో, ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. కానీ వాటిని తరలింపు ఇతర వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. నాపరాతి బండలను లారీలలో, ట్రాక్టర్లలో బాడీ లెవెల్ వరకు నింపకుండా.. అధిక లోడ్డుతో వెహికిల్స్ లో నింపుకొని రోడ్లపైకి రావడం వల్ల.. వెనక వచ్చే వాహనాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఘజియాబాద్‌లో ఓ టెంపోలో అమ్ముతున్న టమాటాలను విక్రయించడానికి చాలా మంది జనాలు బారులు తీరారు. మహాగుణ్ పురం సొసైటీలో చాలా మంది నివాసితులు క్యూలో నిలబడి టమాటాలను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పోలీసులపై టీడీపీ కార్యకర్తల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీ హోంమంత్రి తానేటి వనిత అన్నారు. పోలీసులపై దాడి చేయడం అమానుష చర్య అని ఆమె తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలనే ఉద్దేశంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారు అని హోంమంత్రి పేర్కొన్నారు.
హర్యానాలో హింసాకాండ ఆగడం లేదు. రెండు వర్గాల మధ్య ఘర్షణ చిలికి చిలికి పెద్ద దుమారం రేగింది. అల్లర్లకు కేంద్ర స్థానమైన నుహ్ జిల్లాలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ హింసలో ఇప్పటివరకు ఐదుగురు మరణించగా.. 30 మందికి గాయాలయ్యాయి.