భారీ వర్షాల కారణంగా కాశ్మీర్‌లోని చాలా జిల్లాల్లో చెరువులు, కుంటలు, నదుల నీటిమట్టం పెరిగి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. జమ్మూ కాశ్మీర్‌లో జూలై 20 నుండి నిరంతరంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో శ్రీనగర్ శివార్లతో సహా అనేక ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి.
జార్ఖండ్‌లోని లతేహార్ జిల్లాలో అర్థరాత్రి నక్సలైట్లు బీభత్సం సృష్టించారు. జిల్లాలోని నెటార్‌హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దావ్నా, పురందీ గ్రామాల్లో హల్ చల్ చేశారు. అంతేకాకుండా ఐదుగురిని పోలీస్ ఇన్‌ఫార్మర్లు అనే నెపంతో.. వారిని ఇంటి నుంచి తీసుకెళ్లారు.
ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలోని నమామి గంగే ప్రాజెక్టు వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. అలకనంద నది ఒడ్డున ఉన్న ప్రాజెక్ట్ సైట్‌లోని ట్రాన్స్‌ఫార్మర్‌లో పేలుడు సంభవించిందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంపై సీఎం పుష్కర్ సింగ్ ధామి విచారణకు ఆదేశించారు.
భారతీయ జనతా పార్టీ, విపక్ష పార్టీలు కానీ ప్రజల సంక్షేమం కోసం పని చేయడం లేదని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి అన్నారు. దళితులు, ముస్లింలు, మైనార్టీల కోసం కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఏం చేయలేదని ఆమె అన్నారు. ఆ రెండు పార్టీలు ఒక్కటే.. అధికారంలోకి రాగానే.. వాళ్లు ఇచ్చిన వాగ్థానాలను మరిచిపోతారని బీఎస్పీ చీఫ్ ఆరోపించారు.
భార్య-భర్త, ప్రియురాలు-ప్రియుడు అనే బంధాలు.. ప్రేమ, గౌరవం అనే సంబంధాలపై ఆధారపడి ఉంటాయి. ఒక్కసారి వారి మధ్య నమ్మకం కోల్పోతే.. మళ్లీ భాగస్వామి మనసు గెలుచుకోవడం అంత సులువు కాదు. స్మార్ట్‌ఫోన్‌లు, సోషల్ మీడియా వంటి వాటితో కనెక్టివిటీ చాలా మారింది. అందుకే ప్రజలు ఒకరినొకరు సులభంగా మోసం చేసుకుంటున్నారు.