ఈరోజు దేశంలో ఉన్న పరిస్థితులు చూస్తుంటే భయంగా ఉంది.. 25 కోట్ల మంది ముస్లింలను విలన్లుగా చిత్రీకరిస్తున్నారు.. హిందూ-ముస్లింల మధ్య గొడవలు పెట్టేవాళ్ళ డిపాజిట్ గల్లంతు కావాలి.. ఈ ముప్పై రోజులు ప్రజల్లోకి వెళ్ళండి కాంగ్రెస్-బీజేపీ కుట్రలను ప్రజలకు చెప్పండి అని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.
పండగపూట తమిళనాడు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరువణ్ణామలై సమీపంలోని సెంగం పక్రిపాళయం సెంగం బైపాస్ వద్ద బస్సు, సుమో ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సును కారు ఢీకొట్టడంతో ఘటన చోటుచేసుకుంది.
డీఎస్పీ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఏపీ డీజీపీ కేవీ రాజేంద్ర నాథ్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి మాట్లాడుతూ.. క్షేత్ర స్థాయిలో ఉన్న ఇబ్బందులను జాగ్రత్తగా ఎదుర్కోవాలి.. పోలీసులు ప్రజలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి.
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జాతీయ రహదారి-16పై ఘోర ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కును బస్సు ఢీకొనడంతో నేపాల్‌కు చెందిన 20 మంది యాత్రికులు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. సోరో పోలీస్ స్టేషన్ పరిధిలోని తాలానగర్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 61 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆగిఉన్న ట్రక్కును.. బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి విముక్తి కల్పించిన జాతి పిత మహాత్మాగాంధీ అని ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు అన్నారు. జై జవాన్ జై కిసాన్ నినాదంతో సుపరిపాలన అందించిన లాల్ బహుదూర్ శాస్త్రి, ఇద్దరికి కాంగ్రెస్ తరపున ఘన నివాళులర్పిస్తున్నాం అని ఆయన పేర్కొన్నారు.
తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. కూనూర్‌లోని మరపాలెం సమీపంలో టూరిస్ట్ బస్సు లోయలో పడిపోవడంతో 8 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. 35 మందికి గాయాలయ్యాయి. అందులో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు బస్సులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
మణిపూర్ మళ్లీ అట్టుడుకుతోంది. కాంగ్‌పోక్పి జిల్లాలో మంగళవారం ఉదయం ముగ్గురు గిరిజనులను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. గిరిజనులు అధికంగా ఉండే కంగ్గుయ్ ప్రాంతంలోని ఇరెంగ్, కరమ్ వైఫే గ్రామాల మధ్య ఈ దాడి జరిగిందని కాంగ్ పోక్పి అదనపు పోలీసు సూపరింటెండెంట్ తోలు రాకీ తెలిపారు.
సెప్టెంబర్ నెల నుంచి ఆర్థిక రంగంలో 5 మార్పులు రాబోతున్నాయి. వాటి ద్వారా ప్రజలపై భారాలు పడనున్నాయి. ఆర్థిక రంగంలో సెప్టెంబర్ నెల అనేక మార్పులు తీసుకువస్తోంది.
సామాన్య ప్రజలకు కేంద్ర ప్రభుత్వం త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతుంది. వంటగ్యాస్ ధరలను రూ.200 వరకు తగ్గించాలని ఇప్పటికే మోడీ సర్కార్ నిర్ణయించింది. త్వరలో సిలిండర్‌పై రూ.200 తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకటించబోతోంది.