రైల్వే పనులు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాటలు ఎవ్వరూ నమ్మే స్థితిలో లేరు.. బీఆర్ఎస్ ప్రభుత్వం మాట డ్యామెట్ కథ అడ్డం తిరిగింది చందంలా తయారు అయ్యింది అని ఆయన వ్యాఖ్యనించారు. ఆర్టీసి కార్మికులు వాస్తవాలు గ్రహిస్తున్నారు.. 15-20 వేల కోట్లు అర్టీసీవి వాడుకున్నారు.. ఆర్టీసీ విలీన బిల్లులో వాటి గురించి లేదు.. కార్మికుల సీసీఎస్ డబ్బులు 4500 కోట్లు, పీఎఫ్ డబ్బులు 9 వేల కోట్లు వాడుకున్నారు.. అవి ఎవరిస్తారు అని బండి సంజయ్ ప్రశ్నించారు.
Read Also: Green Tax: వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక పై మీరు ఆ ట్యాక్స్ చెల్లించాల్సిన పనిలేదు
లక్ష కోట్ల అర్టీసీ ఆస్తులని కొల్లగొట్టె ప్రయత్నం చేస్తున్నారు.. కరీంనగర్, ఆర్ముర్ లో ఇప్పటికే ఆర్టీసీ ఆస్తులను లీజు పేరుతో కొల్లగొట్టారు అని బండి సంజయ్ ఆరోపించారు. లక్ష కోట్ల ఆర్టీసీ ఆస్తులను కొట్టేసేందుకు కేసీఆర్ విలీనం డ్రామా ఆడుతున్నారు.. ఆర్టీసి కార్మికుల బెనిఫిట్లు ప్రస్తావన బిల్లులో లేదు.. రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు బయటికి వస్తాయి.. ఆర్టీసీ వారిని మోసం చేసే కుట్ర కేసీఆర్ చేస్తున్నారు.. అర్టీసి ఉద్యోగుల ఓట్ల కోసం కేసీఆర్ విలీనం డ్రామా ఆడుతున్నారని బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ మండిపడ్డాడు.
Read Also: Bhumana Karunakar Reddy: ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ టీటీడీ చైర్మన్ పదవి రాదు
ఆర్టీసీ కార్మికులకు లాభం చేకూరడానికి గవర్నర్ తమిళిసై కృషి చేస్తున్నారు అని బండి సంజయ్ అన్నారు. గ్రామపంచాయతీ కార్మికులకి జీతాలు వెంటనే చెల్లించాలి ఆయన డిమాండ్ చేశారు. కేటీఆర్ భాష, అహాంకారం చూసి ప్రజలు తిరగబడుతున్నారు.. వరదలు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మహరాష్ట్రలో కేసీఆర్ రాజకీయం చేస్తున్నారు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ అనేది అర్థం కావడం లేదని బండి సంజయ్ అన్నారు.
Read Also: MLA Raja Singh: వచ్చే అసెంబ్లీలో నేను ఉండకపోవచ్చు..
కేసీఆర్ దమ్ముంటే కేటీఆర్ ముఖ్యమంత్రి అని ప్రకటించాలి.. కేటీఆర్ ముఖ్యమంత్రి అని ప్రకటిస్తే బీఆర్ఎస్ లో ఎవరూ ఉండరూ.. ప్రీ యూరియా అద్భుతాలు ఎక్కడికి పొయాయి.. మేకపోతు గాంభీర్యంలా బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. రాజాసింగ్ పై కేటీఆర్ కి పోటీ చేసే దమ్ము ఉందా అని బండి సంజయ్ సవాల్ విసిరారు. రాజాసింగ్ ధర్మం కొసం పనిచేసే కార్యకర్త.. ఆయన కోసం ఏదైనా చేసే కార్యకర్తలు గోషామహల్ లో ఉన్నారు అని బండి సంజయ్ పేర్కొన్నారు.