Cinema At Manipur: మణిపూర్‌లో 23 ఏళ్ల తరువాత.. హిందీ సినిమా ప్రదర్శన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cinema At Manipur: జాతుల మధ్య హింసతో గత మూడు నెలలుగా నలిగిపోయిన మణిపూర్‌లో కొద్ది కొద్దిగా పరిస్థితులు చక్కబడుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, కాలేజీలు ప్రారంభం అవగా.. రాష్ట్రంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులను సైతం తిప్పుతోంది. ఇక ఇపుడు ఏకంగా 23 ఏళ్ల తరువాత రాష్ట్రంలో హిందీ సినిమా ప్రదర్శనను సైతం చేపట్టారు. 2000 సంవత్సరంలో రాష్ట్రంలో హిందీ సినిమా ప్రదర్శించవద్దని మైతీ ఉగ్రవాద సంస్థ హెచ్చరించడంతో బంద్ అయిన హిందీ సినిమాల ప్రదర్శన 23 ఏళ్ల తరువాత మంగళవారం తిరిగి ప్రారంభం అయింది. మణిపూర్‌లో మే 3 నుంచి జాతుల మధ్య ఘర్షణలతో రాష్ట్రం రావణ కాష్టంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు జరిగిన ఘర్షణల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. వేల మంది నిరాశ్రయులయ్యారు. మైతీ ఉగ్రవాద సంస్థ హిందీ సినిమా ప్రదర్శించవద్దని 2000 ఏడాదిలో హెచ్చరించడంతో అక్కడ బాలీవుడ్ సినిమాలు ప్రదర్శనకు నోచుకోకపోవడం గమనార్హం. 1998 సంవత్సరంలో చివరిగా ప్రదర్శితమైన సినిమా కుచ్ కుచ్ హోతా హై. ఆ తరువాత 2000 సంవత్సరంలో రాష్ట్రంలో హిందీ సినిమాల ప్రదర్శన చేయరాదని నిషేధం విధించారు.
Read also: Gadar 2: ప్రమాదంలో పఠాన్ రికార్డ్స్… హిందుస్థాన్ జిందాబాద్ నినాదం నార్త్ ని కమ్మేసింది
Also Read
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
23 ఏళ్ల తర్వాత మణిపూర్ హింసాకాండలో తీవ్రంగా ప్రభావితమైన చురాచందాపూర్ జిల్లాలో హిందీ సినిమాను ప్రదర్శించారు. ఇది ఇంఫాల్‌కు 63 కి.మీ.దూరంలో ఉంది. చురాచందాపూర్ జిల్లాలోని రెంగ్‌కైలోని ఓపెన్ ఎయిర్ థియేటర్‌లో మంగళవారం విక్కీ కౌశల్ నటించిన ‘ఉరి..ద సర్జికల్ స్ట్రైక్’ చిత్రాన్ని ప్రదర్శించగా.. పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారు. మైతీ వేర్పాటువాద సంస్థ ‘పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ’కి చెందిన పొలిటికల్ వింగ్ రివల్యూషనరీ పీపుల్స్ ఫ్రంట్ 2000 సెప్టెంబరులో హిందీ చిత్రాలను మణిపూర్‌లో ప్రదర్శించ వద్దని హెచ్చరించింది. అప్పటి నుంచి మణిపూర్‌లో బాలీవుడ్ చిత్రాల ప్రదర్శన ఆగిపోయింది. తిరిగి మంగళవారం ‘హమర్ స్టూడెంట్స్ అసోసియేషన్’(హెచ్‌ఎస్‌ఏ) చొరవతో తిరిగి ప్రారంభమయింది. ఇండోజెనస్ ట్రైబల్ లీడర్స్ ఫోరమ్ అధికార ప్రతినిధి గింజా వల్జాంగ్ మాట్లాడుతూ.. ‘మా ఊరిలో ఓ సినిమా ప్రదర్శించి రెండు దశాబ్దాలు దాటింది. మైతీలు చాలా కాలంగా హిందీ సినిమాలను నిషేధించారు. ఆ గ్రూపు దేశవ్యతిరేక విధానాలను ధిక్కరించి, భారతదేశంపై మన ప్రేమను చాటుకోవడమే నేటి ప్రయత్నం’ అని అన్నారు. ‘దశాబ్దాలుగా ఆదివాసీలను లొంగదీసుకున్న ఉగ్రవాద గ్రూపులకు మా ధిక్కరణ, వ్యతిరేకత బయటపెట్టడమే బాలీవుడ్ సినిమా ప్రదర్శన అని చెప్పింది. ‘స్వేచ్ఛ, న్యాయం కోసం మా పోరాటాన్ని కొనసాగించడానికి ప్రతిజ్ఞ చేయడంలో మాతో చేరండి’ అని ట్రైబల్ లీడర్స్ ఫోరమ్ సోమవారం విజ్ఞప్తి చేసింది. ఈ సంస్థ ప్రకారం చివరిసారిగా మణిపూర్‌లో షారుక్ ఖాన్ నటించిన కుచ్ కుచ్ హోతా హై చిత్రాన్ని 1998లో ప్రదర్శించారు. బాలీవుడ్ సినిమాలను ప్రదర్శించొద్దని మైతీ రివల్యూషనరీ పీపుల్స్ ఫ్రంట్ 2000 సెప్టెంబరులో హెచ్చరించింది. హెచ్చరిక జారీ చేసిన వారం రోజుల్లో హిందీ సినిమాలకు చెందిన దాదాపు 8 వేల వీడియో, ఆడియో క్యాసెట్లు, సీడీలను రెబల్స్ తగులబెట్టారు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!