China Bubonic Plague: చైనాలో బయటపడ్డ మరో ప్రాణాంతక వ్యాధి… బుబోనిక్ ప్లేగు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China Bubonic Plague: ప్రపంచంలోని అగ్ర రాజ్యాల్లో ఒకటిగా చైనా కొనసాగుతోంది. చైనా ఆర్థిక రంగంలో ముందుండుగా… దాంతోపాటు కొత్త కొత్త రోగాలకు సంబంధించిన వైరస్‌లను తీసుకురావడంలోనూ ముందే ఉంటుంది. ఇప్పటికే ప్రపంచాన్ని అతలా కుతలం చేసిన కరోనా వైరస్ కోవిడ్-19 వైరస్ ప్రపంచాన్ని ఎంత ఇబ్బంది పెట్టిందో చూశాము. అలాగే ఇప్పుడు కొత్తగా మరో ప్రాణాంతకమైన వ్యాధి చైనాలో ప్రబలుతోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే రెండు కేసులు సైతం ఆ దేశంలో నమోదైనట్టు అధికారికంగా ప్రటించారు.
Read also: Sarkaru Naukari:”సర్కారు నౌకరి” సినిమా లిరికల్ సాంగ్ రిలీజ్
Also Read
చైనాలో కొత్తగా బుబోనిక్ ప్లేగు వ్యాధి ప్రబలుతోంది. అయితే ఇదేమీ కొత్త వ్యాధేమీ కాదు. కాకపోతే.. కొత్తగా వ్యాపిస్తోంది. చైనా అధీనంలోని ఇన్నర్ మంగోలియాలో ఈ వ్యాధి ఇప్పటికే ఇద్దరికి సోకింది. చైనాకి ఉత్తర ప్రాంతంలో ఇన్నర్ మంగోలియా ఉంటుంది. శనివారం 2 బుబోనిక్ ప్లేగు వ్యాధి కేసులు కన్ఫామ్ అయినట్టు అధికారులు ప్రకటించారు. ఈ వ్యాధి ఆగస్టు 7న మొదలైనట్లు రిపోర్టులు చెబుతున్నాయి. ఓ తండ్రి, కూతురికి ఈ వ్యాధి సోకడంతో.. వారికి టెస్టులు చేసి.. శనివారం నిర్ధారించారు. ఈ నేపథ్యంలో వ్యాధి సోకిన వారితో క్లోజ్ కాంటాక్ట్ ఉన్న వారందర్నీ పిలిపించి టెస్టులు చేశారు. ఎవరిలోనూ అసాధారణ లక్షణాలేవీ కనిపించలేదని ఓ స్టేట్‌మెంట్‌లో అధికారులు ప్రకటించారు. డాక్టర్ల ప్రకారం.. బుబోనిక్ ప్లేగు అనేది.. చాలా వేగంగా వ్యాప్తి చెందే వ్యాధి. ఇది ఎలుకలు, చుంచెలుకలు, పందికొక్కులు ద్వారా, వాటి వ్యర్థాల నుంచి వ్యాపిస్తుంది. అవి తినగా వదిలేసిన ఆహారం నుంచి వ్యాపిస్తుంది. దీన్ని బ్లాక్ డెత్ వ్యాధి అని కూడా అంటారు. ఆఫ్రికా ఖండంలో చాలా మంది నల్ల జాతీయులు ఈ వ్యాధి బారిన పడి చనిపోతుంటారు కాబట్టి అలా పిలుస్తారు. ఈ కేసులు చైనాలో తక్కువే. కానీ ఈమధ్య కొన్నేళ్లుగా ఇన్నర్ మంగోలియా, వాయవ్య నింజియా ప్రాంతంలో ఇలాంటి కేసులు తరచూ వస్తున్నట్టు ప్రకటించారు. ప్లేగు వ్యాధుల్లో చాలా రకాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి ఈ బుబోనిక్ ప్లేగు. ఇది సోకిన వారికి తగిన సమయంలో ట్రీట్‌మెంట్ చెయ్యకపోతే.. ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ప్రకటించింది. బుబోనిక్ ప్లేగు వ్యాధి సోకి వారి శరీరంలోకి ప్లేగ్ బ్యాసిల్లస్, వై.పెస్టిస్ అనే సూక్ష్మజీవులు ఎంటర్ అవుతాయి. ఆ తర్వాత వాటి సంఖ్యను పెంచుకుంటాయి. ఈ బుబోనిక్ ప్లేగు వ్యాధి మనుషుల నుంచి మనుషులకు సోకే అవకాశాలు తక్కువ. ఇందులో కూడా.. నిమోనిక్ ప్లేగు అనేది అత్యంత ప్రమాదకరమైనదని.. అది ఊపిరి తిత్తులకు వ్యాపించి.. ప్రాణం తీసేస్తుందని వైద్యులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
-
AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..