ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి, అదానీ గ్రూపు అధినేత గౌతమ్ అదానీకి అమెరికా కోర్టు సమన్లు జారీ చేసింది. అవినీతి, పెగాసస్ స్పైవేర్, అమెరికాకు నగదు తరలింపు తదితర ఆరోపణలతో ఓ భారతీయ అమెరికన్ వైద్యుడు దావా వేశారు.
పెగసస్ స్పై వేర్ అంశంపై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. పెగసస్ స్పై వేర్ పై కోర్టు నియమించిన నిపుణుల కమిటీ సమర్పించిన నివేదిక అందిందని సీజేఐ ఎన్వీ రమణ తెలిపారు. అయితే.. మాల్‌వేర్ గురైనట్లు అనుమానిస్తున్న 29 మొబైల్ పరికరాలను పరీక్షించినట్లు టెక్నికల్ కమిటీ తెలిపిందని, టెక్నికల్ కమిటీ జర్నలిస్టుల వాంగ్మూలాలను కూడా నమోదు చేసిందని సీజేఐ వెల్లడించారు. తుది నివేదికను సమర్పించేందుకు టెక్నికల్ కమిటీ సమయం కోరడంతో సీజేఐ అంగీకరించారు. ఈ నేపథ్యంలో.. మొబైల్…
ఏపీ రాజకీయాల్లో పెగాసస్ వివాదం హాట్ టాపిక్‌గా మారింది. ఈ అంశంపై అధికార, ప్రతిపక్షాలు మాటల యుద్ధానికి తెరలేపాయి. ఈ నేపథ్యంలో టీడీపీని ఉద్దేశిస్తూ మంత్రి కురసాల కన్నబాబు విమర్శలు చేశారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నిఘా వ్యవస్థను భ్రష్టు పట్టించారని ఆరోపించారు. అధికారులు, పొలిటికల్ లీడర్ల ఫోన్లు ట్యాప్ చేశారన్నారు. చివరికి సినిమా యాక్టర్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని విమర్శించారు. గతంలో ఇంటిలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావుపై అనేక ఆరోపణలు వచ్చాయన్నారు. మమతాబెనర్జీ..…
పెగాసెస్ స్పైవేర్‌పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో సంస్థ నాలుగైదేళ్ల క్రితం పెగాసస్ స్పైవేర్‌ను తమకు అమ్మేందుకు బెంగాల్ వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు ఆమోదం కానందున ఆ సంస్థ ఆఫర్‌ను తాము తిరస్కరించామని చెప్పారు దీదీ. నాలుగైదు ఏళ్ల క్రితం ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. పెగాసస్ స్పైవేర్ విక్రయించడానికి బెంగాల్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌ను సంప్రదించిందని చెప్పారు. 25 కోట్లు డిమాండ్ చేశారని…
పెగాసస్ వ్యవహారం భారతీయ రాజకీయాలను ఓ కుదుపు కుదిపేసింది.. పార్లమెంట్ ఉభయసభలను స్థంభించిపోయాయి.. అయితే, పెగాసస్ స్పైవేర్‌పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన ప్రకటన చేశారు. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో సంస్థ నాలుగైదేళ్ల క్రితం పెగాసస్ స్పైవేర్‌ను తమకు అమ్మేందుకు బెంగాల్ వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు ఆమోదం కానందున ఆ సంస్థ ఆఫర్‌ను తాము తిరస్కరించామని చెప్పారు దీదీ. నాలుగైదు ఏళ్ల క్రితం ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. పెగాసస్ స్పైవేర్…
దేశాన్ని కుదిపేసిన పెగాసస్ స్పైవేర్ వ్యవహారం మరోసారి సుప్రీంకోర్టుకు చేరింది. పెగాసస్‌పై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఈ విషయంలో భారత్-ఇజ్రాయెల్ మధ్య జరిగిన ఒప్పందంపై దర్యాప్తు చేయాలని పిటిషనర్, న్యాయవాది ఎంఎల్ శర్మ కోరారు. ఈ ఒప్పందంలో పాల్గొన్న వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలని పిటిషనర్ అత్యున్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. పెగాసస్‌పై న్యూయార్క్ టైమ్స్ ఇటీవల ప్రచురించిన వివరాలను ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. Read Also: ఔను .. భారత్ పెగాసిస్ కొనుగోలు…
సంచలనం సృష్టించిన పెగాసెస్ కుంభ కోణం విషయంలో రేపు తీర్పు వెలువరించనుంది సర్వోన్నత న్యాయస్థానం.. పెగాసెస్ స్పైవేర్‌ను నిబంధనలకు వ్యతిరేకంగా ఉపయోగించి ప్రజలపై కేంద్ర ప్రభుత్వం నిఘా ఉంచిందా..? లేదా..? తెలుసుకోవాలనుకుంటున్నామని వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు.. సెప్టెంబర్ 13న తీర్పు రిజర్వు చేసిన సంగతి తెలిసిందే.. ఈ కుంభకోణంపై నిపుణుల కమిటీతో సంప్రదించాల్సి ఉందని వ్యాఖ్యానించింది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ట్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమకోహ్లిలతో కూడిన ధర్మాసనం. సంప్రదించిన కొంతమంది నిపుణులు వ్యక్తిగత కారణాలతో…
భారత రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసిన, పార్లమెంట్ సమవేశాలను కుదిపేస్తోన్న పెగాసస్ వ్యవహారంపై విచారణ చేపట్టనుంది సుప్రీంకోర్టు.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం ముందు వాదనలు జరగనున్నాయి.. కేంద్ర మాజీ ఆర్ధిక మంత్రి యశ్వంత్ సిన్హా తో సహా మొత్తం 10 మంది పిటిషనర్లుగా ఉన్నారు.. కాగా, ప్రపంచవ్యాప్తంగా మొత్తం 17 ప్రముఖ మీడియా సంస్థలు సంయుక్త పరిశోధనాత్మక వార్తా కథనాలతో పెగాసస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగు చూసింది..…
పార్లమెంట్ సమావేశాలకు ముందు పెగాసస్ అంశం దేశాన్ని అతలాకుతలం చేసింది. పెగాసస్ స్పేవేర్‌తో దేశంలోని ప్రముఖులపై కేంద్రం నిఘా ఉంచిందని పలు అంతర్జాతీయ మీడియాలో కథనాలు రావడంతో ప్రతిపక్షాలు ఈ అంశాన్ని పార్లమెంట్ ఉభయసభల్లో చర్చించాలని పట్టుబడుతున్నాయి. అయితే, ఈ అంశాన్ని కేంద్రం లైట్‌గా తీసుకుంది. పెగాసస్ అంశం చర్చకు తీసుకురాకుండా మిగతా అంశాలను చర్చించేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తున్నది. Read: బిగ్ ఓటిటి రిలీజ్ : పృథ్వీరాజ్ సుకుమారన్ “కురుతి” రెడీ కానీ, అందుకు ప్రతిపక్షాలు…