పెగాసస్ వ్యవహారం భారతీయ రాజకీయాలను ఓ కుదుపు కుదిపేసింది.. పార్లమెంట్ ఉభయసభలను స్థంభించిపోయాయి.. అయితే, పెగాసస్ స్పైవేర్‌పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన ప్రకటన చేశారు. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో సంస్థ నాలుగైదేళ్ల క్రితం పెగాసస్ స్పైవేర్‌ను తమకు అమ్మేందుకు బెంగాల్ వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు ఆమోదం కానందున ఆ సంస్థ ఆఫర్‌ను తాము తిరస్కరించామని చెప్పారు దీదీ. నాలుగైదు ఏళ్ల క్రితం ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. పెగాసస్ స్పైవేర్ విక్రయించడానికి బెంగాల్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌ను సంప్రదించిందని చెప్పారు. 25 కోట్లు డిమాండ్ చేశారని అన్నారు. అయితే, న్యాయమూర్తులు, అధికారులకు వ్యతిరేకంగా వినియోగించడంతోపాటు రాజకీయంగా దీనిని దుర్వినియోగం చేసే అవకాశం ఉండటంతో తిరస్కరించానని సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఇలాంటివి ఆమోదయోగ్యం కాదన్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో ఏపీ ప్రభుత్వం ఈ స్పైవేర్‌ను కొనుగోలు చేసిందని మమత పేర్కొన్నారు.
Read Also: Holi: ఇంద్ర ధనుస్సులోని రంగులు ఇంటింటా వసంతంగా కురవాలి-సీఎం జగన్