Lawsuit on PM Modi: మోడీ, జగన్, అదానీకి అమెరికా కోర్టు సమన్లు జారీ.. ఎందుకో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lawsuit on PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి, అదానీ గ్రూపు అధినేత గౌతమ్ అదానీకి అమెరికా కోర్టు సమన్లు జారీ చేసింది. అవినీతి, పెగాసస్ స్పైవేర్, అమెరికాకు నగదు తరలింపు తదితర ఆరోపణలతో ఓ భారతీయ అమెరికన్ వైద్యుడు దావా వేశారు. రాజకీయ ప్రత్యర్థులపై పెగాసస్ స్పైవేర్‌ను ఉపయోగిస్తున్నారని ఆయన వ్యాజ్యంలో ఆరోపించారు. భారతీయ-అమెరికన్ డాక్టర్ ఉయ్యూరు లోకేశ్ అమెరికాలో కొలంబియా డిస్ట్రిక్ట్ కోర్టులో ఈ ఏడాది మే 24న 53 పేజీల పిటిషన్ దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన డా.లోకేశ్.. అమెరికాలోని రిచ్‌మండ్‌లో గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌గా పని చేస్తున్నారు.
NASA Artemis 1 Launch: రేపే ఆర్టెమిస్-1 ప్రయోగం.. సిద్ధం చేసిన నాసా..
Also Read
- Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
- Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
- Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
- H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
ప్రపంచ ఆర్థిక వేదిక వ్యవస్థాపకుడు క్లాస్ స్క్వాబ్ పేరును కూడా లోకేశ్ దావాలో ప్రస్తావించారు. ఈ వ్యాజ్యంపై విచారణ కోసం కొలంబియా డిస్ట్రిక్ట్ కోర్టు వీరికి సమన్లు జారీ చేసింది. మోడీ, జగన్, అదానీకి ఆగస్టు 4న, స్విట్జర్లాండ్‌లో ఉన్న క్లాస్ స్క్వాబ్‌కు ఆగస్టు 2న సమన్లు వెళ్లాయి.అయితే న్యూయార్క్‌కు చెందిన ప్రముఖ భారతీయ-అమెరికన్ అటార్నీ జనరల్ రవి బాత్రా దీనిని “డెడ్ ఆన్ అరైవల్ దావా”గా పేర్కొన్నారు. ఈ దావాపై సంతకం చేయడానికి న్యాయవాదులెవరూ అంగీకరించలేదని ఆయన చెప్పారు. డాక్టర్ లోకేశ్ ఖాళీగా ఉన్నారని, అందుకే 53 పేజీల దావా వేశారని బాత్రా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!