ప్రస్తుతం దేశాన్ని పెగాసస్ స్పైవేర్ కుదిపేస్తున్నది. దేశంలోని 300 మందికి సంబందించిన ఫోన్‌లపై నిఘాను ఉంచారని, ఫోన్‌లను ట్యాపింగ్ చేశారని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సర్కార్ కూలిపోవడానికి కూడా స్పైవేర్ కారణమని మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ విషయంపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి స్పందించారు. గత 10-15 ఏళ్లుగా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయని, ఇలాంటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. గతంలో ప్రభుత్వాలు, ఆదాయపన్ను శాఖ ప్రజల ఫోన్లను…
దేశాన్ని కుదిపేస్తున్న పెగాసస్ హ్యాకింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు కొన్ని వెలుగులోకి వచ్చాయి. దేశంలోని ప్రముఖులకు చెందిన ఫోన్ నెంబర్లు ఇప్పటికే హ్యాకింగ్‌కు గురైనట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కాగా ఇప్పుడు మరో విషయం బయటకు వచ్చింది. కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా, ఆ పార్టీలకు చెందిన నేతల ఫోన్ నెంబర్లపై కూడా నిఘా ఉంచినట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి ఇది కూడా ఒక కారణం అనే అనుమానాలు…
ప్రస్తుతం దేశాన్ని పెగాసిస్ స్పైవేర్ కుదిపేస్తున్నది. పార్లమెంట్‌లో దీనిపై పెద్ద ఎత్తున రగడ జరగడం ఖాయంగా కనిపిస్తున్నది. అన్నింటికి పక్కన పెట్టి ఈ స్పైవేర్‌పై చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఫోన్ పలుమార్లు హ్యాకింగ్‌కు గురైనట్టు ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు తన ఫోన్ ను ఐదుసార్లు మార్చినట్టు పేర్కాన్నారు. అయినప్పటికీ ఫోన్ హ్యాకింగ్‌కు బారిన పడుతూనే ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఫోరెన్సిక్ నివేదికల ప్రకారం…