ఏపీలో సీఎం జగన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పూర్తయింది. మొత్తం 25 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. 11 మంది పాతమంత్రులు అందులో వున్న సంగతి తెలిసిందే. మరోవైపు అమరావతి సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు మంత్రులు పినిపె విశ్వరూప్, పెద్దిరెడ్డి, చెల్లుబోయిన, అంజాద్ బాషా. పేదల కోసం డీబీటీ విధానాన్ని సీఎం జగన్ తీసుకువచ్చారు. సంక్షేమ ఫలాలు అవినీతి లేకుండా పేదలకు చేర్చుతున్నారు. నవరత్నాలు ప్రజలకు మరింత చేరువ చేస్తాం అన్నారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్. కేబినెట్…
ఏపీలో కొత్త కేబినెట్ కూర్పు కొలిక్కి వచ్చినట్టే అని భావిస్తున్నారు. అయితే మంత్రి పదవిని ఆశించినవారు తీవ్ర నిరాశకు, అసంతృప్తికి గురవుతున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంటికి ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ఱారెడ్డి వెళ్లారు. ఆయనతో కలిసి మాట్లాడారు. పదవులు రానివారికి బుజ్జగింపుల పర్వం మొదలయ్యిందని అంటున్నారు. బాలినేని నివాసంలో ఎక్కడా సందడి కనిపించడంలేదు. పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు, కార్యకర్తలు బాలినేని నివాసం దగ్గరకు చేరుకుంటున్నారు. కొంత మంది కార్యకర్తలు గేటు బయటే పడిగాపులు పడుతున్నారు.…
చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో తాను గ్రానైట్ అక్రమ మైనింగ్ చేసినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. చంద్రబాబు సీనియర్ శాసనసభ్యుడిగా ఉండి జిల్లాకు ఏం చేశాడని ప్రశ్నించారు. కుప్పంను అభివృద్ది చేయాలని కలలు కన్నాడని చెబుతున్నారని, 14 ఏళ్లు సీఎం గా ఉండి ఏం చేశారని ప్రశ్నించారు. ఐదేళ్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజలకు దేవుఉ అయ్యారని, చంద్రబాబు చిత్తూరు జిల్లాలో పుట్టడం మన దురదృష్టమని అన్నారు.…
రైతుల మహాపాదయాత్ర ముగింపు సభ ఈరోజు తిరుపతిలో జరిగింది. ఈ సభలో రైతులతో పాటుగా ప్రతిపక్షాలు కూడా పాల్గొన్నాయి. తిరుపతిలో జరిగిన మహా పాదయాత్ర ముగింపు సభపై మంత్రి పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని, త్వరలోనే మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో పెడతామని అన్నారు. ఇది రైతుల ఉద్యమం కాదని, టీడీపీ దగ్గరుండి అమరావతి ఉద్యామాన్ని నడిపిస్తోందని అన్నారు. నైతిక విలువల్లేకుండా పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చాయని, తోక పార్టీలను…
ఏపీలో 3 రాజధానుల అంశం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. జగన్ సర్కార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. దీంతో హైకోర్టు విచారణ చేపట్టింది. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు పలు అంశాలపై ప్రభుత్వంపై ప్రశ్నలు గుప్పించింది. అంతేకాకుండా నేటికి విచారణను వాయిదా వేసింది. దీంతో నేడు విచారణకు హజరైన అడ్వకేట్ జనరల్ 3 రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు ఉన్నత న్యాయస్థానానికి వెల్లడించారు. ఈ విషయంపై అత్యవసరంగా నిర్వహించిన కేబినెట్ సమావేశంలో చర్చించి 3…
హుజురాబాద్ ఉపఎన్నికలో గెలుపుకోసం అధికారపార్టీ వ్యూహ రచన చేస్తుంటే.. మరోవైపు పార్టీలోని ఇద్దరు నేతల మధ్య పంచాయితీ కలవర పెడుతోందట. ఆ ఇద్దరూ కొత్తగా గులాబీ కండువా కప్పుకున్నవాళ్లే కావడంతో.. వారి అంతర్గత విభేదాలు టీఆర్ఎస్ శ్రేణులకు ఇబ్బందిగా మారాయట. ఒకే వరలో రెండు కత్తులు ఇమడలేవన్నట్టుగా చిటపటలాడుతున్నాట. వారెవరో.. లెట్స్ వాచ్..! ఎడముఖం పెడముఖంగా కౌశిక్‌రెడ్డి, ఇ.పెద్దిరెడ్డి..? హుజురాబాద్ ఉపఎన్నిక కాకమీద ఉంది. నియోజకవర్గంలో కులాలు, సంఘాలు, సంస్థల ఆత్మీయ సమ్మేళనాలపై టీఆర్‌ఎస్ ఎక్కువ ఫోకస్…
సీఎం జగన్ రోడ్ల అభివృద్ధి పై సమీక్ష చేశారు అని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. గత టీడీపీ హయాంలో పీఎంజిఎస్ వై ద్వారా 330 కిలోమీటర్లు మాత్రమే వేశారు. మేము 3,185 కిలోమీటర్లకు టెండర్లు పిలిచి 970 కిలోమీటర్లు పూర్తి చేశాము. ఏఐబీ ద్వారా 5,238 కిలోమీటర్లు టెండర్లు పిలిస్తే.. 1816 కిలోమీటర్లు రోడ్లు పూర్తి చేసాము. టీడీపీ హయాంలో పంచాయతీ రాజ్ శాఖ తరపున 1,130 కిలోమీటర్లు రోడ్లు వేశారు. అక్టోబర్ నాటికి టెండర్లు పిలిచి…
మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి .. నేడు టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. తెలంగాణభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నారు. తన అనుచరులు, కార్యకర్తలు, నాయకులతో సీఎం సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు పెద్దిరెడ్డి ఇప్పటికే తెలిపారు.కేసీఆర్ సర్కార్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నానన్నారు పెద్దిరెడ్డి.హుజూరాబాద్‌లో ఈటలకు బీజేపీ అధిష్ఠానం అధిక ప్రాధాన్యమివ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవల పెద్దిరెడ్డి రాజీనామా చేశారు. read also : భారత్ ఘోర పరాజయం.. సిరీస్…