ఏపీలో సీఎం జగన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పూర్తయింది. మొత్తం 25 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. 11 మంది పాతమంత్రులు అందులో వున్న సంగతి తెలిసిందే. మరోవైపు అమరావతి సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు మంత్రులు పినిపె విశ్వరూప్, పెద్దిరెడ్డి, చెల్లుబోయిన, అంజాద్ బాషా.
పేదల కోసం డీబీటీ విధానాన్ని సీఎం జగన్ తీసుకువచ్చారు. సంక్షేమ ఫలాలు అవినీతి లేకుండా పేదలకు చేర్చుతున్నారు. నవరత్నాలు ప్రజలకు మరింత చేరువ చేస్తాం అన్నారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్. కేబినెట్ కూర్పులో 70 శాతం ఎస్సీ, ఎస్టీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు చోటు కల్పించారు. ఏపీలో ప్రకృతి సంపద వనరులు ఉన్నాయి. సినీ రంగానికి అనుకూల వాతావరణం ఉంది. మద్రాస్ నుంచి హైదరాబాదుకు సినీ రంగం ఎలా షిఫ్ట్ అయిందో..అలా ఏపీలో తక్కువ బడ్జెట్లో సినిమాలు తీసే విధంగా అవకాశం ఉందన్నారు. జగన్ విషయంలో మీడియా ఆరా తీయకుండా ఆరాధించాలన్నారు.
https://ntvtelugu.com/peddireddy-ramachandra-reddy-take-charge-minister-of-energy-forest/
రాష్ట్రంలో దాదాపు 11,271 బస్సులు తిరుగుతున్నాయని, ప్రయాణీకులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు 998 బస్సులను కొత్తగా అద్దెకు తీసుకున్నాం అన్నారు మంత్రి పినిపె విశ్వరూప్. తిరుమలలో ఎటువంటి కాలుష్యం లేకుండా ఆ పుణ్యక్షేత్ర పవిత్రతను కాపాడాలనే ఉద్దేశ్యం ఉందన్నారు. 100 ఎలక్ట్రిక్ బస్సులను ఇప్పటికే తీసుకున్నాం. తిరుమలలో తొలి ఎలక్ట్రిక్ బస్సు తిరుమలకు ఈనెల 15న చేరుకోబోతుంది. డీజిల్ రేట్లు పెరగడం వల్ల ఆర్టీసీ కష్టాలు మరింతగా పెరిగాయి. ఆర్టీసీపై భారం పడకుండా చర్యలు తీసుకుంటాం అన్నారు మంత్రి విశ్వరూప్. వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడతామని, ట్రైబ్యునల్ ఏర్పాటుకు కృషి చేస్తాం అన్నారు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అంజాద్ బాషా.