Pakistan Cricket: ఐసీసీకి పోటీగా కొత్త క్రికెట్ బోర్డు.. పీసీబీ ప్రయత్నం ఆదిలోనే ఫెయిల్?
- ఐసీసీ స్థాయి క్రికెట్ సంస్థ ఏర్పాటుకు పీసీబీ ప్రయత్నం
- 8 క్రికెట్ బోర్డులను సంప్రదించిన పీసీబీ
- పీసీబీ ప్రయత్నం ఆదిలోనే ఫెయిల్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మరోసారి అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో నవ్వులపాలవుతోంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి ప్రత్యామ్నాయంగా.. తమకంటూ ఒక ఐసీసీ స్థాయి క్రికెట్ సంస్థను ఏర్పాటు చేయాలనే ఆలోచనతో పీసీబీ చేసిన ప్రయత్నం పూర్తిగా ఫెయిల్ అయినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనకు మద్దతు కోరుతూ పీసీబీ ఏకంగా 8 క్రికెట్ బోర్డులను సంప్రదించినట్లు తెలుస్తోంది. అందులో కేవలం రెండు దేశాలు మాత్రమే మద్దతు ఇవ్వడంతో పీసీబీకి భారీ షాక్ తగిలింది.
కొత్త క్రికెట్ బోర్డు కోసం చైనా, బంగ్లాదేశ్, యూఏఈ, ఒమాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ స్టేట్స్, వెస్టిండీస్, జింబాబ్వే వంటి దేశాలతో పీసీబీ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఐసీసీ నిర్ణయాలపై అసంతృప్తితో ఉన్న దేశాలను ఏకం చేసి. కొత్త అంతర్జాతీయ సంస్థను ఏర్పాటు చేయాలన్నది పీసీబీ ప్లాన్‌గా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఆలోచనకు ప్రపంచ క్రికెట్ నుంచి పెద్దగా స్పందన రాలేదు. పీసీబీ సంప్రదించిన ఎనిమిది బోర్డుల్లో ఆరు బోర్డులు నో చెప్పినట్లు సమాచారం. యూఏఈ, ఒమాన్, సౌదీ అరేబియా, యుఎస్‌ఏ, వెస్టిండీస్, జింబాబ్వే ఈ ప్రతిపాదనను తిరస్కరించినట్లు టాక్. కేవలం చైనా, బంగ్లాదేశ్ మాత్రమే పీసీబీ ఆలోచనకు మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది.
Also Read
- WTC Points: పాకిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఇంగ్లండ్.. మారిపోయిన WTC పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే..
- India Matches: రేపు భారత్‌కు డబుల్ ధమాకా.. అఫ్గాన్‌తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
- Mohammed Siraj: డీఎస్పీ మొహమ్మద్ సిరాజ్‌కు ప్రమోషన్.. హైదరాబాద్ రంజీ కెప్టెన్‌గా జట్టు పగ్గాలు.!
- Wasim Akram: PSL, PCBపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు.. వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తావిస్తూ..!
Also Read: No iPhone 18: యాపిల్ లవర్స్‌కు షాక్.. ‘ఐఫోన్ 18’ లేనట్లేనా?
ఆరు దేశాల తిరస్కరణతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చేసిన ఐసీసీ స్థాయి సంస్థ ఆలోచన మొదటి దశలోనే కుప్పకూలినట్టైంది. ఈ పరిణామంపై అటు క్రికెట్ అభిమానులు, ఇటు విశ్లేషకులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఐసీసీకి పోటీగా మరో అంతర్జాతీయ సంస్థను ఏర్పాటు చేయడం అంత ఈజీనా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముందు పాకిస్థాన్ క్రికెట్ తన అంతర్గత సమస్యలను పరిష్కరించుకోవాలని, ఆటపై దృష్టి పెట్టాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి పీసీబీ మరోసారి అనవసర నిర్ణయాలతో క్రికెట్ ప్రపంచంలో నవ్వుల పాలయ్యిందనే అభిప్రాయం సోషల్ మీడియాలో వినిపిస్తోంది.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!